Ad Code

గ్రూప్​లో సభ్యులను చేర్చుకోవడం మరింత సులభం !


వాట్సాప్​ తన యూజర్ల కోసం అదిరిపోయే అప్​డేట్​ తీసుకొచ్చింది. వాట్సాప్​ గ్రూప్​ చాట్​లోనే.. కొత్త గ్రూప్​లకు పార్టిసిపెంట్స్​ను చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తూ అప్​డేట్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఫీచర్​ ఒక షార్ట్​కట్​గా పనిచేస్తుంది. కనుక యూజర్లు తమ కొత్త గ్రూప్​లో సభ్యులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు. బీటాఇన్ఫో ప్రకారం, ప్రస్తుతం గ్రూప్​ చాట్​లో ఒక కొత్త బ్యానర్​ కనిపిస్తుంది. ఇది వాట్సాప్ కొత్త​ గ్రూప్​లో చేరేందుకు ఇతరులను ఆహ్వానిస్తుంది. దీని వల్ల గ్రూప్​ చాట్​ అనుమతించినంత మేరకు, వాట్సాప్​ గ్రూప్​లో కొత్త వ్యక్తులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ నయా ఫీచర్​ వాట్సాప్ బీటా ఐవోఎస్​​ 23.15.1.77 వెర్షన్​లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొంత మంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్​.. త్వరలో అందరు వాట్సాప్​ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్​ ఈ సరికొత్త ఫీచర్​ వల్ల వాట్సాప్​ గ్రూప్​లోని సభ్యులు  నేరుగా ఇతరులను తమ గ్రూప్​లో చేర్చుకోవచ్చు. ఇందుకోసం గ్రూప్ ఇన్ఫోను తెరవాల్సిన అవసరం కూడా ఉండదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ లేటెస్ట్ వాట్సాప్​​ ఫీచర్ ఒక రిమైండర్​లా కూడా పనిచేస్తుంది.​ గ్రూప్​ల్లోకి కొత్త సభ్యులను చేర్చుకునే విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu