Ad Code

తెలుగులో గూగుల్‌ బార్డ్‌ సేవలు !


చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ తీసుకొచ్చిన 'బార్డ్‌' ఏఐ చాట్‌బోట్‌ సేవలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూలోనూ బార్డ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు గూగుల్‌ సంస్థ గురువారం వెల్లడించింది. మొత్తంగా 40 భాషల్లో బార్డ్‌ సేవలు లభిస్తాయని తెలిపింది. అలాగే గూగుల్‌ లెన్స్‌ ఫీచర్లను కూడా బార్డ్‌కు అనుసంధానించనున్నట్టు పేర్కొంది. ఏదైనా ఫొటోకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నా, ఫొటోకు క్యాప్షన్‌ పెట్టాలన్నా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుందని వివరించింది. అయితే ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉన్నదని, త్వరలోనే మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu