Ad Code

టాటా గ్రూప్‌ చేతికి ఆపిల్‌ ఫోన్ల తయారీ సంస్థ ?


టాటా సంస్థ ఐఫోన్‌లు తయారీని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అన్ని అనుకూలంగా జరిగితే త్వరలో టాటా సంస్థ ఐఫోన్‌ తయారీ రంగంలోని అడుగుపెట్టనుంది. భారత్‌లో ప్రస్తుతం ఆపిల్‌ ఫోన్లు తయారీ చేస్తున్న విస్ట్రాన్‌ సంస్థను టాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆపిల్‌ ఫోన్లు తయారీ చేసే తొలి భారత సంస్థగా టాటా గ్రూప్‌ నిలవనుంది. ఐఫోన్‌ల తయారీ సంస్థ విస్ట్రాన్‌ ప్లాంట్‌ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఉంది. టాటా, విస్ట్రాన్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరితే.. ఆ ప్లాంట్‌ను టాటా సంస్థ స్వాధీనం చేసుకోనుంది. ప్రస్తుతం విస్ట్రాన్‌ సంస్థలో 10 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఒప్పందం పూర్తయితే వారంతా టాటా సంస్థ ఉద్యోగాలుగా మారనున్నారు. కాంట్రాక్టులపై స్మార్ట్‌ఫోన్లను తయారీ చేసే తైవాన్‌ దేశానికి చెందిన విస్ట్రాన్‌ సంస్థ.. 2024 మార్చి నాటికి కర్ణాటక ప్లాంట్‌ నుంచి సుమారు రూ.14,830 కోట్ల విలువైన ఫోన్లను తయారు చేస్తామని ఆపిల్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా తన ఉద్యోగులను మూడు రెట్లకు పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ఐఫోన్‌ 14 మోడల్‌ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్‌ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న విస్ట్రాన్ సంస్థ సమీప భవిష్యత్‌లో భారత్‌లో ఐఫోన్ల తయారీ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆ సంస్థను టాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ ఒప్పందం గురించి టాటా, యాపిల్‌, విస్ట్రాన్‌ సంస్థలు ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే వారి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఆగస్టులో ఒప్పందం కుదురుతుందని సమాచారం వెలువడుతోంది. ఈ ఒప్పందం పూర్తయితే ఆపిల్‌ ఫోన్లను తయారుచేస్తున్న తొలి భారత సంస్థగా టాటా గుర్తింపు పొందుతుంది. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. కరోనా అనంతర కాలంలో చైనాను విడిచిపెట్టి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత్ కూడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఆసక్తి వ్యక్తం చేస్తున్న సంస్థలను ఆహ్వానిస్తోంది. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ సంస్థ ప్రస్తుతం $600 మిలియన్ కంటే ఎక్కువ విలువైనది. గత మూడు నెలల్లో విస్ట్రాన్‌ సంస్థ భారత్‌ నుంచి 500 మిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా గ్రూపు అనేక రంగాలకు విస్తరించి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ వైపు అడుగులు వేస్తోంది. టాటా సంస్థకు తమిళనాడు రాష్ట్రంలో వందల ఎకరాల్లో అతిపెద్ద ఫ్యాక్టరి ఉంది. ఇందులో ఐఫోన్‌ ఛాసిస్‌ను తయారు చేస్తోంది. దీంతోపాటు చిప్‌ తయారీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu