Ad Code

వాట్సాప్‌లో ముఖ్యమైన ప్రైవసీ ఫీచర్స్ !


'వాట్సాప్' ఎప్పటికప్పుడు సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. లేటెస్ట్ ఫీచర్లతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని కల్పిస్తూ ప్రైవసీని కల్పిస్తోంది. తాజాగా మరో ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ లేటెస్ట్‌గా చాట్ లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమకు నచ్చిన చాట్‌ని లాక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్నాక చాట్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ లేదా పాస్‌వర్డ్‌ టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చాట్‌ని చూసేందుకు వీలు కలుగుతుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా చాట్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి 'చాట్ లాక్ ఫీచర్'పై ట్యాప్ చేయాలి. ఇలా కావాల్సినన్ని చాట్‌లను యూజర్లు లాక్ చేసుకోవచ్చు. ఇలా లాక్ అయిన చాట్‌లు స్క్రీన్‌ పైభాగాన కనిపిస్తాయి.  చాలా మంది యూజర్లకు యాప్ లాక్ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. వాట్సాప్ యాప్‌కి ఫింగర్‌ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. తమ వాట్సాప్‌ని ప్రైవేటుగా ఉంచుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫింగర్‌ప్రింట్ లాక్‌ని ఎనేబుల్ చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. కాంటాక్టులను బ్లాక్ చేసే ఫీచర్ వాట్సాప్‌లో ప్రాచుర్యం పొందింది. కాల్స్ రాకుండా ఉండేందుకు సదరు కాంటాక్టులను బ్లాక్ చేయొచ్చు లేదా సైలెంట్‌లో పెట్టొచ్చు. గుర్తు తెలియని నంబర్ల(Unknown)ను కూడా సైలెంట్‌లో పెట్టుకోవచ్చు.

సెండర్ పంపిన మెసేజ్‌ని రిసీవర్ ఓపెన్ చేస్తే బ్లూ టిక్స్ పడతాయి. కానీ, మెసేజ్ ఓపెన్ చేసినా కూడా బ్లూ టిక్స్ పడకుండా చేసేందదుకు ఫీచర్ ఉంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి రీడ్ రిసీప్ట్స్‌ని ఆఫ్ చేస్తే ఇక ఎదుటివారికి బ్లూ టిక్స్ కనిపించవు. అయితే, యూజర్‌కి కూడా ఈ బ్లూటిక్స్ కనిపించవు. యూజర్లు తమ ప్రొఫైల్ స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్ వంటి వాటిని ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వారితో కనెక్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. తెలియని గ్రూప్‌లలో యూజర్ల అనుమతి లేకుండా జాయిన్ చేయలేం. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఇతరులు మిమ్మల్ని ఏదైనా గ్రూప్‌లలో యాడ్ చేయాలని అనుకుంటే మీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరికి మాత్రమే నేరుగా యాడ్ చేసే విధంగా పర్మిషన్ ఇవ్వొచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌ని అప్‌డేట్ చేయాలి. యూజర్లకు మరింత భద్రత కల్పిస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని సెటప్ చేసుకుంటే వాట్సాప్‌ ఓపెన్ చేసే సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇతరులు లాగిన్ అయ్యేందుకు ఛాన్స్ ఉండదు. అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. 6 డిజిట్ పిన్‌ని సెటప్ చేసుకుంటే ఇక ఇతరులు ఓపెన్ చేయలేరు. వాట్సాప్ వాడుతుంటే చాట్ కింద 'ఆన్‌లైన్' అని అవతలి యూజర్‌కి స్టేటస్‌ని డీఫాల్ట్‌గా చూపిస్తుంది. ఇలా కనిపించకుండా చేయొచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ట్యాగ్‌ని హైడ్ చేసుకుంటే ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. మెసేజ్‌లు వాటంతటవే కనిపించకుండా చేయడానికి వాట్సాప్‌ 'డిసప్పియరింగ్ మెసేజెస్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెటప్ చేసిన గడువు ముగియగానే చాట్‌లోని మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అవుతాయి. 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల తర్వాత అంటూ ఈ గడువును ఎంచుకోవచ్చు. వాట్సాప్‌లో మీకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను సైలెంట్ చేసే ఫీచర్‌ ఉంది. కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే కాల్స్ లిస్ట్‌లో ఈ డేటా కనిపిస్తుంది కానీ, కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే మీ ఫోన్ రింగ్ అవ్వదు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu