Ad Code

సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ సిస్టమ్స్ కంట్రోల్‌కు నిపుణుల టీం ఏర్పాటు !


ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన ఓపెన్ఏఐ ఈ దశాబ్ధంలో మరో సరికొత్త ఆవిష్కరణపై ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో లేని సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ సిస్టమ్స్ ఈ దశాబ్ధంలోనే మన ముందుకొస్తాయని చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ అంచనా వేస్తోంది. న్యూ టెక్నాలజీతో పెను సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో ప్రయోజనాలున్నా, అదే స్ధాయిలో వీటితో పెనుముప్పులూ ఎదురవుతాయని ఓపెన్ ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. న్యూ టెక్నాలజీతో ముప్పులను, సవాళ్లను కట్టడి చేసి సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ సిస్టమ్స్‌ను నియంత్రించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. తమ పరిశోధకులు సుకెవర్‌, జాన్ లీక్ ఈ పనులను, టీమ్‌ను పర్యవేక్షిస్తారని పేర్కొంది. తమ బృందంలో చేరేందుకు అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన ఎంఎల్ రీసెర్చర్లు, ఇంజనీర్లను కంపెనీ ఆహ్వానించింది. సూపర్ ఇంటెలిజెన్స్ మానవాళి ఆవిష్కరించిన అద్భుత ప్రభావవంతమైన టెక్నాలజీ అని, ఇది ప్రపంచం ఎదుర్కొనే కీలక సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుందని బ్లాగ్‌ పోస్ట్‌లో ఓపెన్ ఏఐ పేర్కొంది. ఏఐ సమస్యను మానవ పర్యవేక్షణలో సాగే ఏఐ వ్యవస్ధను సృష్టించడం ద్వారా అధిగమించాలని ఓపెన్ ఏఐ కోరుకుంటోందని తెలిపింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu