Ad Code

న్యూట్రాన్ నక్షత్రాలకు ఎందుకంత ప్రత్యేకత ?


భారీ నక్షత్రం పేలిపోయిన తర్వాత మిగిలిన పదార్థం మరుగుజ్జు నక్షత్రంలా మారుతుంది. దాన్నే న్యూట్రాన్ స్టార్ అంటారు. ఆ పేలిపోయే నక్షత్రం బరువు సూర్యుడి కంటే 10 నుంచి 25 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ నక్షత్రం లోహపూరితమైనది అయితే మరింత ఎక్కువ బరువు ఉంటుంది. అంటే అది సూపర్‌నోవా నక్షత్రం అనుకోవచ్చు. ప్రస్తుతం న్యూట్రాన్ స్టార్స్‌ని స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తున్నారు. సూర్యుడితో పోల్చితే ఈ నక్షత్రాలు చాలా చిన్నవి, 10 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటాయి. కానీ చాలా దట్టంగా ఉంటాయి. భారీ సూపర్‌నోవా నక్షత్రంలో భారం పెరిగి, కేంద్రంపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ నక్షత్రం ఒక్కసారిగా పేలిపోతుంది. దాని అవశేషాలతో ఈ మరుగుజ్జు నక్షత్రాలు పుడతాయి.  న్యూట్రాన్ నక్షత్రాలు ఏర్పడిన తర్వాత ఇవి వేడిని ఉత్పత్తి చెయ్యలేవు. చల్లగా ఉంటాయి. అలాగని వీటిని తక్కువ అంచనా వెయ్యలేం. మరో నక్షత్రం, అంతరిక్ష పదార్థం ఏదైనా టచ్ చేసే వరకే అవి అలా ఉంటాయి. టచ్ చెయ్యగానే తీరు మార్చుకుంటాయి. మరింత వేగంగా తిరుగుతాయి. తద్వారా తమ చుట్టూ ఉన్న ప్రదేశంలో చాలా సమస్యలు తెస్తాయి. మాగ్జిమం న్యూట్రాన్ నక్షత్రాలన్నింటిలో.. మొత్తంగా ఉండేది న్యూట్రాన్లే. సాధారణ పదార్థాల్లో ఉండే ఎలక్ట్రాన్లూ, ప్రోటాన్లూ కలిసి న్యూట్రాన్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. న్యూట్రాన్స్ స్టార్స్‌ విషయంలో ఇలా జరుగుతుంది. న్యూట్రాన్స్ స్టార్స్ కూడా పేలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకు న్యూట్రాన్స్ ప్రెషర్ కారణం కాగలదు. విశ్వంలోని రిపల్సివ్ న్యూక్లియర్ ఫోర్స్‌లు.. మరుగుజ్జు నక్షత్రాలను మరింతగా పేలిపోయేలా చెయ్యగలవు. ఈ క్రమంలో ఇవి ఓ దశలో కృష్ణబిలాలుగా మారిపోగలవు. ఈ మరుగుజ్జు నక్షత్రాలు చాలా బరువుగా ఉంటాయి. ఎంత బరువు అంటే.. ఈ నక్షత్రంలోని ఓ అగ్గిపెట్టె సైజును తీసుకొని తూకం వేస్ దాని బరువు 300 కోట్ల టన్నులు ఉంటుంది. ఇదే బరువును భూమితో కంపేర్ చేస్తే.. భూమిలో 0.5 క్యూబిక్ కిలోమీటర్ భూమి ఇంత బరువు ఉంటుంది. అంటే.. ఓ నగరం పరిమాణంలో ఉండే న్యూట్రాన్ నక్షత్రం.. అనేక సూర్యుళ్ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. అంతేకాదు.. ఈ నక్షత్రాల అయస్కాంత క్షేత్రాలు కూడా భూమి అయస్కాంత క్షేత్రాలతో పోల్చితే.. 10 కోట్ల నుంచి 1 క్వాడ్రిలియన్ రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. న్యూట్రాన్స్ స్టార్స్‌ చాలా వేగంగా తిరుగుతాయి. సెకండ్‌కి కొన్ని వందలసార్లు గుండ్రంగా తిరుగుతాయి. ఇలా తిరిగే న్యూట్రాన్స్ స్టార్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విడుదల అవుతుంది. ఇదో రకమైన కాంతి. లైట్‌హౌస్ కాంతి ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. ఈ కాంతి విశ్వంలో చాలా దూరం వెళ్తుంది. ఇలా కాంతిని విడుదల చేసే న్యూట్రాన్ స్టార్స్‌ని పల్సార్స్ అని పిలుస్తారు. 1967లో తొలిసారిగా పల్సార్‌ని గుర్తించారు. దాంతో ఇలాంటి నక్షత్రాలు ఉన్నాయనే విషయం బయటపడింది. మనక తెలిసి అత్యంత వేగంగా తిరిగే న్యూట్రాన్ నక్షత్రం.. సెకండ్‌కి 716 సార్లు తనచుట్టూ తాను తిరుగుతోంది. అంటే.. కాంతి వేగంలో నాలుగోవంతు వేగం. మన పాలపుంత గెలాక్సీలో 100 కోట్ల న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయని అంచనా. ఐతే.. వీటిలో చాలావరకు చిన్నగా, చల్లగానే ఉన్నాయి. వేగంగా తిరిగే పల్సార్‌లను మాత్రమే సైంటిస్టులు కనిపెట్టగలుగుతున్నారు. నెమ్మదిగా తిరిగే న్యూట్రాన్ స్టార్స్ మనకు ఇక్కడి నుంచి చూస్తే కనిపించట్లేదు. 1990లో హబుల్ టెలిస్కోప్ RX J1856.5−3754 మరుగుజ్జు నక్షత్రాన్ని కనిపెట్టింది. దీంతోపాటూ.. మరికొన్నింటిని కూడా చూపించింది. పల్సార్ల నుంచి విడుదలయ్యే కాంతి ద్వారా.. సైంటిస్టులు.. విశ్వంలోని వేర్వేరు ప్రాంతాలను గమనించగలుగుతున్నారు. అలాగే.. గురుత్వాకర్షణ తరంగాలు, ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడుతుననాయి. అంతరిక్షంలో ఏది ఎక్కడ, ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఈ పల్సార్లు లైట్‌హౌస్‌లలా పనిచేస్తున్నాయి. ఐతే.. ఈ పల్సార్‌లలో అయస్కాంత క్షేత్రాలు ఎందుకు ఇంత బలంగా ఉంటాయి? ఎందుకు అధిక రేడియేషన్ విడుదల అవుతోంది అనేది పజిల్‌లా ఉంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu