Ad Code

వాట్సాప్ లో రీడిజైన్డ్ సెర్చ్ బార్ ?


వాట్సాప్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా అప్‌డేట్ 2.23.16.5లో రీడిజైన్డ్‌ సెర్చ్ బార్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లేటెస్ట్ బీటా వెర్షన్ ఇన్‌స్టాల్‌ చేసుకున్న కొందరు వాట్సాప్ యూజర్లకు కొత్త సెర్చ్ బార్ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాలను ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. మెటీరియల్ డిజైన్ 3 మార్గదర్శకాలను అనుసరించి ఈ సెర్చ్ బార్‌ను వాట్సాప్ రీడిజైన్ చేసినట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ కొత్త సెర్చ్ బార్ లుక్‌ స్క్రీన్‌షాట్ కూడా పంచుకుంది. అందులో ఈ రీడిజైన్డ్‌ సెర్చ్ బార్ చాలా ఆకర్షణీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా కనిపించింది. ఈ అప్‌డేటెడ్ డిజైన్ సెట్టింగ్స్‌, మెసేజ్ కన్వర్జేషన్స్ వంటి వివిధ సెక్షన్లలోని సెర్చ్ బార్‌లతో సహా యాప్ అంతటా ఒకేలా మారిందని వెల్లడించింది. మెయిన్ సెర్చ్ బార్ మాత్రమే కాకుండా మిగతా సెర్చ్ బార్లు కూడా చేంజ్ అయ్యాయి. వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ 2.23.16.5లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్ కూడా అందుబాటులోకి వచ్చింది. కొంతమంది లక్కీ బీటా టెస్టర్లకు రీడిజైన్డ్‌ సెర్చ్ బార్‌తో సహా టాప్ యాప్ బార్‌లోని ఐటెమ్స్‌ కొత్త వైట్ కలర్‌లో కనిపించాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వారికి ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. తదుపరి వారాల్లో ఇది క్రమంగా మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu