Ad Code

నిర్దిష్ట సమాచారం కోరుకునే వారికి బార్డ్ సరైన వేదిక కాదు !


పెన్ఏఐ క్రియేషన్ చాట్‌జీపీటీకి దీటుగా ఏఐ టూల్ బార్డ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ చాట్‌బాట్ సెర్చికి ప్రత్యామ్నాయంగా, గూగుల్ సమాచారానికి నూతన మార్గంగా బార్డ్ చాట్‌బాట్ పురోగతి సాధిస్తుందని అందరూ భావించారు. ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌గా బార్డ్ ఇంకా చాలా మెరుగుపడాల్సిన పరిస్ధితి కాగా, బార్డ్ కొన్ని సార్లు తప్పుడు సమాధానాలు కూడా ఇస్తుందని స్వయంగా తన హోంపేజ్‌లోనే డిస్‌క్లెయిమర్ ఇచ్చారు. ఇక గూగుల్ యూకే బాస్ లేటెస్ట్‌గా బార్డ్‌ను నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితమైన సమాచారం అందించే గూగుల్ సెర్చి ఇంజన్‌ను ఉపయోగించాలని తాము యూజర్లను ప్రోత్సహిస్తామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ బ్రిటన్ ఎండీ డెబీ వీన్‌స్టీన్ స్పష్టం చేశారు. నిర్ధిష్ట సమాచారం కోరుకునే వారికి బార్డ్ సరైన వేదిక కాదని ఆమె తేల్చిచెప్పారు. బార్డ్ రెస్పాన్స్‌లు నమ్మదగినవి కావని ఇంతకుముందు పలువురు గూగుల్ ఉద్యోగులు సైతం పేర్కొన్నారు. బార్డ్ పోటీలో నిలిచేందుకు నాసిరకం నాణ్యతా ప్రమాణాలతో కూడిన సమాచారాన్ని చేరవేస్తుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 మంది ప్రస్తుత, మాజీ గూగుల్ ఉద్యోగులు పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu