Ad Code

సెమీ కండక్టర్లకు భారత్ ఎకో సిస్టమ్ చాలా అనుకూలం !


గుజరాత్ లోని గాంధీనగర్‌లో సెమీకాన్ ఇండియా-2 సదస్సులో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ మాట్లాడుతూ భారత్ లో సెమీ కండక్టర్ల తయారీకి కార్యాచరణ ప్రణాళిక ఆశావాహంగా ఉందన్నారు. వేదాంతాతో కలిసి సెమీ కండక్టర్ల తయారీకి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ నుంచి రూ.1,60,300 కోట్ల (19.5 బిలియన్ డాలర్లు) నిధులను ఉపసంహరించుకున్నది. కార్లు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే చిప్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం మరో భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్ అన్వేసిస్తుంది. భారత్‌లో సెమీ కండక్టర్ల తయారీకి తమ సంస్థ అత్యంత విశ్వసనీయమైన, నమ్మకమైన సంస్థ అని యంగ్ లియూ పేర్కొన్నారు. వేదాంతాతో జాయింట్ వెంచర్ నుంచి వైదొలిగిన తర్వాత.. సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ కోసం దరఖాస్తు సమర్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఫాక్స్ కాన్ తెలిపింది. తమతో కలిసి వచ్చే భాగస్వాముల కోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu