Ad Code

సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల డిమాండ్‌ !


సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఫైనాన్స్‌ జరుపుతున్న కార్స్‌24 సంస్థ గంటకు 30 వాహనాలను అమ్మేసింది మరి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం (క్యూ2)లో రూ.18,000 కోట్లకుపైగా వ్యాపారం జరిగినట్టు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే ఏకంగా 87 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్కెట్‌లోకి రకరకాల వేరియంట్లు అబ్బురపరిచే ఫీచర్లతో వస్తుండటంతో చాలామంది ఇప్పటికే ఉన్న తమ పాత కార్లను అమ్మేస్తున్నారు. ఇందుకు కార్స్‌24 వంటివి చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక అటు అమ్మేవారికి, ఇటు కొనేవారికి లాభదాయకంగా లావాదేవీలు జరుగుతుండటం.. ఈ బిజినెస్‌ను బడా మార్కెట్‌గానే మార్చేసింది. యూజ్డ్‌ కార్‌ సెగ్మెంట్‌లో హచ్‌బ్యాక్‌ మాడల్స్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తున్నది. కార్స్‌24 క్యూ2 అమ్మకాల్లో 62 శాతం వాటా హచ్‌బ్యాక్‌దే. కాగా, మెట్రో నగరాలకు ధీటుగా నాన్‌-మెట్రో నగరాల్లోనూ యూజ్డ్‌ కార్ల క్రయవిక్రయాలు బాగా జరుగుతున్నట్టు కార్స్‌24 వెల్లడించింది. పుణె, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రీ-ఓన్డ్‌ కార్‌ సేల్స్‌ హుషారుగా సాగుతున్నట్టు పేర్కొన్నది. నచ్చిన కార్లు సరసమైన ధరలకే లభిస్తుండటం, ఫైనాన్స్‌ సౌకర్యం కూడా ఉండటం, వారంటీలు ఇస్తుండటం తమ వ్యాపారానికి కలిసొస్తున్నట్టు కార్స్‌24 సహవ్యవస్థాపకుడు గజేంద్ర జంగిడ్‌ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కిపైగా ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్స్‌24 వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తదితర నగరాలూ ఉన్నాయి. మరికొన్ని నగరాలకూ విస్తరించే పనిలో సంస్థ ఉన్నది. 2015లో నలుగురు కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు విదేశాల్లోనూ బిజినెస్‌ చేస్తుండటం విశేషం. ఇదిలావుంటే యూజ్డ్‌ కార్ల మార్కెట్‌లో రూ.2 లక్షల నుంచి 5 లక్షల మధ్య ధర కలిగిన కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. క్యూ2 లావాదేవీల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉన్నట్టు కార్స్‌24 వర్గాలు చెప్తున్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu