Ad Code

బ్లూ టిక్ యూజర్ల కు కొత్త ఫీచర్‌ !


ట్విట్టర్‌ బ్లూ యూజర్లు ఇకపై తమ లైక్‌ బటన్‌ను, సబ్‌స్రైబర్ల సంఖ్యను ఇతరులకు కనిపించకుండా దాచేయవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా వీటిని తాము మాత్రమే చూడవచ్చు. ఇంతకుముందు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్విట్టర్‌ బ్లూ ఫీచర్‌.. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ ట్వి్ట్టర్‌ను సొంతం చేసుకున్నాక అనేక మార్పులు తీసుకువస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థ ఇటీవలే థ్రెడ్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌ను 5 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu