Ad Code

మారుతీ సుజుకి ప్రీమియం ఇన్విక్టో విడుదల !


దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకి ఇండియా సరికొత్త మోడల్ ప్రీమియం మోడల్ ఇన్విక్టో కారును లాంచ్ చేసింది.  ఈ కారు ప్రాథమికంగా గత ఏడాదిలో లాంచ్ చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ MPVకి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016 నుంచి 2019లో మారుతీ, టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత లాంఛనప్రాయంగా ఇన్విక్టో మరో ప్రొడక్టుగా దేశ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్‌తో సహా కొత్త రంగాలలో దీర్ఘకాలిక సహకారాన్ని ప్రోత్సహిస్తుందని సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. మారుతి ప్రీమియం ఇన్విక్టో కారు మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్), Aplha+ (7 సీటర్). మొదటి ట్రిమ్ ధర రూ. 24.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడిల్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇన్విక్టో నెలకు రూ. 61,860కి సబ్‌స్క్రిప్షన్‌కు కూడా అందుబాటులో ఉంటుంది. నెక్సా బ్లూ, మిస్టిక్ వైట్‌తో సహా 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. నెక్సా లైనప్‌కి ఇది 8వ ఉత్పత్తి. ఇన్విక్టో మారుతి నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ కాగా.. నెక్సా ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తుంది. ఈ కొత్త కారులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 172BHP పవర్, 188Nm టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇందులో e-CVT యూనిట్ ఆఫర్‌లో ఏకైక ట్రాన్స్‌మిషన్ అని చెప్పవచ్చు. మారుతి సుజుకి శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కంపెనీ SUV విభాగంలో 24 శాతం వృద్ధిని అంచనా వేస్తోందన్నారు. పెద్ద మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. మారుతి టాప్ బ్రాస్ కొత్త లాంచ్‌లు కంపెనీకి వాల్యూమ్ వృద్ధికి సాయపడతాయని తెలిపారు. గత జూన్‌లో దేశంలోని అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం పెరిగి 133,027 యూనిట్లకు చేరుకున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ యుటిలిటీ వాహనాల అమ్మకాలు ఏడాది క్రితం కన్నా రెండింతలు పెరిగాయి.

Post a Comment

0 Comments

Close Menu