Ad Code

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ గోళం !


మెరికాలోని లాస్ వెగాస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ గోళం ఆకర్షణీయంగా నిలుస్తోంది. వేగాస్ స్కైలైన్‌లో ఎల్‌ఈడీ లైట్లతో ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో స్క్రీన్‌ వీడియో వైరల్ అవుతోంది. ఎంఎస్‌జీ స్పియర్ అని పిలుస్తున్న ఈ కొత్త ఆవిష్కారం సిన్ సిటీకి కొత్త అందాలతోపాటు సరికొత్త కీర్తిని తెచ్చిపెట్టింది. కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు 366 అడుగుల ఎత్తైన గోళాన్ని విస్మయంతో వీక్షించారు. లాంతరు, భూమి సహా భారీ ఐబాల్, బాస్కెట్‌బాల్, స్నో గ్లోబ్, జాక్-ఓ వంటి అనేక మెస్మరైజింగ్‌ డిస్‌ప్లేలు ఉన్నాయి. బౌల్-ఆకారంలో 366 అడుగుల పొడవు , 516 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో అత్యధిక రిజల్యూషన్ ర్యాప్‌రౌండ్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను రూపొందించారు. దాదాపు 1.2 మిలియన్ LED పుక్‌లతో రూపొందించబడిం 580,000-చదరపు అడుగులతో ప్రోగ్రాం చేసిన ఈ ఎక్సోస్పియర్ గ్లోబులో 48 వ్యక్తిగత LED డయోడ్‌లు ఉంటాయి. ఇది 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ డిస్‌ప్లే భూమి, మార్స్ చంద్రుడిగా మారిపోతుంది. స్పేస్‌షిప్‌లాగా, అంతరిక్షం నుండి భూమిలా మెరిసిపోతుంది. గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్‌జీ దీన్ని తయారు చేసింది. ఈ బిగ్గెస్ట్‌ ఐ బాల్‌ కోసం ఎంఎస్‌జీ 2.3 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసిందట. తన 40 ఏళ్ల సర్వీసులోఇంతటి అద్భుతాన్ని చూడలేదని స్పియర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రిచ్ క్లాఫీ కెప్పారు. నెవాడాలోని లాస్ వెగాస్‌లో( జూలై 04, 2023న) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇది సందడి చేసింది. సెప్టెంబర్ 29న అధికారికంగా లాంచ్‌కానుందని భావిస్తున్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu