Ad Code

థ్రెడ్స్‌లో 'ఫాలోయింగ్' ట్యాబ్ !


న్‌స్టాగ్రామ్ పేరెంట్‌ కంపెనీ మెటా, ఇటీవలే థ్రెడ్స్ పేరుతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ట్విట్టర్ కిల్లర్‌గా పాపులర్ అయిన ఈ సంస్థ, మరికొన్ని కొత్త ఫీచర్లను లాంచ్ చేయడంపై దృష్టి పెట్టింది. తాజాగా థ్రెడ్స్‌లో ట్విటర్‌ను పోలిన 'ఫాలోయింగ్' ట్యాబ్ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి తెలిపారు. ప్రస్తుతానికి థ్రెడ్స్‌లో బగ్ ఫిక్సెస్‌, ప్లాట్‌ఫామ్‌ స్టెడిలిటీ కొనసాగించడంపై దృష్టి సారించినట్లు మొస్సేరి చెప్పారు. 'ఫాలోయింగ్' ట్యాబ్ గురించిన ప్రశ్నలకు స్పందిస్తూ, రాబోయే వారాల్లో దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో వ్యక్తులను ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా యూజర్ ఫీడ్స్‌లో కొత్త అకౌంట్‌లను డిస్‌ప్లే చేసే ఫెసిలిటీతో థ్రెడ్స్‌ పాపులర్ అవుతోందన్నారు. మెటా లాంచ్‌ అయిన ఒక రోజులోనే భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్‌తో పాపులర్‌ అయింది. ఇది ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో టాప్‌ ఫ్రీ యాప్‌గా రికార్డులు క్రియేట్‌ చేసింది. టెక్స్ట్ అప్‌డేట్స్ షేర్ చేయడానికి, పబ్లిక్ కన్వర్జేషన్స్‌లో పాల్గొనడానికి ఒక వేదికగా థ్రెడ్స్‌ను క్రియేట్‌ చేశారు. వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో దీనికి లాగిన్ కావచ్చు. గరిష్టంగా 500 క్యారెక్టర్స్‌తో పోస్ట్‌లను క్రియేట్‌ చేయవచ్చు. 5 నిమిషాల నిడివి గల లింక్‌లు, ఫోటోలు, వీడియోలను యాడ్‌ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే థ్రెడ్స్‌లో ఫ్రెండ్స్‌తో, ఇంట్రస్ట్‌లను షేర్‌ చేసుకునే క్రియేటర్స్‌తో కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారిని థ్రెడ్స్‌లో కూడా ఫాలో అవ్వొచ్చు. యాప్‌లో చేరిన తర్వాత 16 ఏళ్లలోపు (లేదా నిర్దిష్ట దేశాల్లో 18 ఏళ్లలోపు) వినియోగదారుల ప్రొఫైల్స్‌ ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌ మోడ్‌లో ఉంటాయి. వారి పోస్ట్‌లను ఎవరు మెన్షన్‌ చేయవచ్చు లేదా వాటికి ఎవరు రెస్పాండ్‌ కావొచ్చు అనేది కంట్రోల్‌ చేసుకోవచ్చు.    https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu