Ad Code

శాంసంగ్‌ గెలాక్సీ S21 FE సేల్ !


శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S21 FE అప్‌డేట్‌ చిప్‌సెట్‌తో కొత్త ఫోన్‌ విడుదల అయింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం స్నా్ప్‌ డ్రాగన్‌ చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేయనుంది. ఈ ఫోన్‌ భారత్‌లో ఆన్‌లైన్‌, రిటైల్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ S21 FE స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ 6.4 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే్ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, గొరెల్లా విక్టస్‌ ప్రొటక్షన్‌తో రానుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 888 5G చిప్‌సెట్‌తో 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీను కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S21 FE స్మార్ట్‌ఫోన్‌ 4500mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 వన్‌ UI 5.1 ఆధారంగా పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 12MP ప్రైమరీ కెమెరా, 12MP ఆల్ట్రావైడ్‌ కెమెరాతోపాటు 8MP టెలీఫోటో లెన్స్‌తో రానుంది. మరియు ముందు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ సొంత Exynos 2100 ప్రాసెసర్‌ను కలిగి ఉండేది. అయితే ప్రస్తుతం ఈ వేరియంట్‌ను ఉత్పత్తిని నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, రిటైల్ స్టోర్‌ ప్రస్తుతం ఈ ఫోన్‌ స్టాక్‌ లేనట్లుగా తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ S21 Exynos లభ్యతపై అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ S21 FE స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, Wi Fi 6, బ్లూటూత్‌ 5, ఎన్‌ఎఫ్‌సీ, GPS/ A- GPS, వైర్‌లెస్‌ Dex మరియు టైప్‌ C ఉన్నాయి. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ S21 FE కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్‌ప్లే, నాణ్యమైన కెమెరా, ఇతర ఫీచర్లు సహా ఆకట్టుకొనే పనితీరును కనబరుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ S21 FE స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.49,999గా ఉంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం ఐదు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. నావీ, ఓలివ్‌, గ్రాఫైట్‌, లావెండర్‌, మరియు వైట్‌ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్‌, రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. HDFC EMI లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.5000 తగ్గింపును పొందవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu