Ad Code

గంట పనికి జీతం రూ.1.2 కోట్లు !


కంపెనీలో అయినా ఉద్యోగులు కనీసం రోజుకు 8 నుంచి 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే జీతంలో కోత విధిస్తారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కవ సమయమే పనిచేయాల్సి వస్తుంటుంది. అన్ని గంటలు పనిచేసినా జీతం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే, దిగ్గజ టెక్‌ కంపెనీ అయిన గూగుల్‌ లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ మాత్రం రోజుకు 1 గంట మాత్రమే పని చేస్తూ, ఏడాదికి ఏకంగా రూ.కోటికిపైనే వేతనం అందుకుంటున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న దెవాన్‌ అనే 20 ఏళ్ల టెకీ మాత్రం రోజుకు గంట మాత్రమే పనిచేస్తున్నాడట. జీతం మాత్రం ఏడాదికి రూ. 1.24 కోట్లు తీసుకుంటూ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. దేవాన్‌ గూగుల్‌లోని కోడింగ్‌ విభాగంలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గూగుల్ టూల్స్ అండ్ ప్రొడక్ట్స్ కోసం కోడింగ్ రాస్తుంటాడు. అయితే అతడు రోజుకు ఒక గంట మాత్రమే పనిచేస్తున్నాడు. మిగతా టైమ్‌లో బీచ్‌లు, పార్క్‌లు సహా రోజూ బోలెడు జాలీ రైడ్స్‌కి వెళ్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తాడట. అంటే నెలలో మొత్తంగా 24 నుంచి 28 గంటలు మాత్రమే వర్క్‌ చేస్తాడు. అలా గంట పనికి ఏడాదికి రూ.1.24 కోట్లు తీసుకుంటున్నాడట. దాంతో పాటు బోనస్‌లు కూడా అందుకుంటున్నాడు. ఈ విషయాన్ని దేవాన్‌నే స్వయంగా వెల్లడించాడు. 'నేను ఎక్కువ గంటలు పని చేయాలనుకుంటే స్టార్టప్‌ కంపెనీలో ఉండేవాడిని. ఎక్కువ గంటలు పనిచేయాలనే ఒత్తిడి నాకు లేదు. చాలా మంది వ్యక్తులు వర్క్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకునేందుకు, ఇతర ప్రయోజనాల కోసం గూగుల్‌ను ఎంచుకుంటారు. మీరు యాపిల్‌ కంపెనీలో కూడా పని చేయొచ్చు. యాపిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువ గంటలు పని చేస్తారు. కానీ, గూగుల్‌లో వారు చేసే పని వారికి తెలుసు. నేను కూడా వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఒకడినే. అయితే, నేను కష్టపడకుండా వేగంగా పని చేసేందుకే ఇష్టపడతాను' అంటూ దెవాన్‌ చెబుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu