Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, August 14, 2023

13 ఎంపీ ఏఐ కెమెరాతో మోటో ఈ 13 విడుదల !


మోటో ఈ13 పేరుతో మోటరోలా సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఆగస్టు 16 నుండి ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లు బడ్జెట్‌ ధరలో లభించ నుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ అనే మూడు రంగుల్లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన టెక్నాలజీ, పెర్‌ఫామెన్స్‌తో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లోని ఏఐ పవర్డ్‌ కెమెరా "ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్‌తో పర్ఫెక్ట్ షాట్‌ను తీయడంతోపాటు, ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ మీ ఫోటోలను స్వయంచాలకంగా మెరుగుపరుస్తాయని స్మార్ట్‌ఫోన్ వెల్లడించింది. 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌, ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ, Dolby Atmos ఆడియో, 13 ఎంపీ ఏఐ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌. 

No comments:

Post a Comment

Popular Posts