Ad Code

సెప్టెంబర్‌లో ఆపిల్ ఐపోన్ 15 సిరీస్ విడుదల ?


పిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్ నుంచి ఐఫోన్ 15 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తేదీని ఎట్టకేలకు నిర్ణయించింది. ఆపిల్ సెప్టెంబర్ మూడో వారంలో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  ఈ సమయంలో ఆపిల్ ఉద్యోగులు ఒకేసారి సెలవులు తీసుకోవద్దని కూడా కంపెనీ సూచించినట్టు నివేదిక తెలిపింది. సాధారణంగా, ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలోనూ, ఆపిల్ సాధారణంగా మంగళవారం తన ఐఫోన్‌లను ప్రకటించింది. గత ఏడాది ఈవెంట్ ట్రెండ్‌ను అనుసరించి సెప్టెంబర్ 7న (బుధవారం) జరిగింది. 2023 ఏడాదిలో సెప్టెంబర్ 13 (బుధవారం) కూడా వస్తుంది. ఆపిల్ స్పెషల్ లాంచ్ ఈవెంట్ ఇదే రోజు కావచ్చు. ఐఫోన్ 15 సిరీస్ కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే చుట్టూ కొద్దిగా కర్వడ్ ఎడ్జ్, సన్నని బెజెల్స్‌తో లేటెస్ట్ డిజైన్‌ను సూచిస్తున్నాయి. అలాగే, 4 కొత్త మోడల్‌లు సాధారణ లైట్నింగ్ కనెక్టర్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్‌లను కలిగి ఉండవచ్చు. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్‌లను సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్ స్థానంలో కొత్త టైటానియం ఫ్రేమ్ అందించనుంది.హుడ్ కింద, ఐఫోన్ 15, 15 ప్లస్‌లు ఐఫోన్ 14 ప్రో మాదిరిగానే A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. అయితే, ఐఫోన్ 15 Pro, 15 Pro Max కొత్త A17 చిప్‌ను అందించనున్నాయి. అదనంగా, పెద్ద ప్రో మోడల్ కొత్త పెరిస్కోప్ లెన్స్‌తో రావచ్చు. ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు మెరుగైన ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను అందిస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu