Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 29, 2023

150 రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ !


దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా బీఎస్‌ఎన్‌ఎల్‌కు సిగ్నల్‌ వస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినా బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొన్ని వర్గాల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు గ్రామీణులకు అధిక మద్దతు లభిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఎప్పటికప్పడు వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కొత్తకొత్త ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తుంది. ముఖ్యంగా వినియోగదారులకు తక్కువ ధరకే అధిక ప్రయోజనాలు అందించే వివిధ రీచార్జి ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. గతంలో అధిక ప్రజాదరణ పొందిన రూ.397 ప్లాన్‌ తిరిగి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌లోని ప్రయోజనాలు మార్చి ఈ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసింది. ముఖ్యంగా 150 రోజుల చెల్లుబాటును ప్రకటించింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజువారీ 2 జీబీ డేటాను అందిస్తుంది. ప్రస్తుత అప్‌డేట్‌ చేసి ప్లాన్ దాని మునుపటి ఆఫర్‌లతో పోలిస్తే వినియోగదారులకు కాస్త ఖరీదైనదిగా మారింది. ఇంతకుముందు ఈ ప్లాన్‌లో 180 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉండగా డేటా పరిమితి రోజుకు 2 జీబీగా ఉండేది ఇది కాకుండా 60 రోజుల పాటు అపరిమిత ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వచ్చేవి. కస్టమర్‌లు ఇప్పటికీ అన్ని ఫీచర్‌లను పొందినప్పటికీ ఇది కేవలం 30 రోజులకు మాత్రమే పరిమితం చేశారు.. 

No comments:

Post a Comment

Popular Posts