Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, August 2, 2023

యువ 2 ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లోకి యువా 2 ప్రో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ యువా 2  ఫోన్ విడుదల చేసింది. యువ 2 కొన్ని ఫీచర్లతో పాత మోడల్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తోంది. సెల్ఫీ కెమెరాతో రెండు ఫోన్‌లు ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టయిల్ నాచ్‌ను కలిగి ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలకు బదులుగా 2 కెమెరా సెన్సార్లు ఉన్నాయి. లావా MediaTekకి బదులుగా Unisoc (Unisoc T606) చిప్‌సెట్‌ని కూడా ఉపయోగిస్తోంది. లావా సింగిల్ 3GB RAM, 64GB స్టోరేజ్ మోడల్ ధర కేవలం రూ. 6,999తో యువ 2ని ప్రవేశపెట్టింది.యువ 2 ప్రో కన్నా లావా యువ 2ని రూ. 1,000 చౌకగా అందిస్తుంది. రెండింటి మధ్య కలర్ ఆప్షన్లను అలాగే ఉంటాయి. కస్టమర్‌లు గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. ఈరోజు నుంచి లావా రిటైల్ నెట్‌వర్క్‌లో యువ 2 అందుబాటులో ఉంటుంది. లావా Yuva 2 ఫోన్ 13MP డ్యూయల్ AI వెనుక కెమెరా, స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అనామక ఆటో-కాల్ రికార్డింగ్ ఫీచర్, నాయిస్ క్యాన్సిలేషన్ డ్యూయల్ మైక్రోఫోన్‌లను కూడా పొందవచ్చు. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. టైప్-C 10W ఛార్జర్‌తో వస్తుంది. లావా కొత్త ‘సింక్’ స్క్రీన్ డిస్‌ప్లేతో 90Hz డిస్‌ప్లే కూడా ఉంది. సింక్ డిస్‌ప్లే 'హై స్క్రీన్-టు-బాడీ రేషియో' 'లోయర్ బెజెల్స్' అందించడంపై దృష్టి పెడుతుందని కంపెనీ వివరిస్తుంది. అయినప్పటికీ, రూ.10వేల సెగ్మెంట్‌లోని స్మార్ట్‌ఫోన్‌లలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఇప్పటికీ ఉంది. లావా వెనుక ప్యానెల్ గాజు లాంటి పదార్థాన్ని ఉపయోగించింది. Yuva 2 ఫోన్ ప్రస్తుతం (Android 12)లో రన్ అవుతుంది. అయితే, కంపెనీ క్లీన్, బ్లోట్‌వేర్ లేని Android ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 స్మార్ట్‌ఫోన్ Android 13 అప్‌డేట్‌ను అందుకుంటుంది. రెండు ఏళ్ల పాటు ఫోన్ త్రైమాసిక భద్రతా అప్‌డేట్‌లను కూడా అందుకుంటుంది. ఇతర లావా ఫోన్ల మాదిరిగానే డివైజ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు లావా Yuva 2 ఫోన్ 'free service at home' సర్వీసుకు అర్హత పొందుతుంది. ఈ ఫోన్ వారంటీ వ్యవధిలోపు డోర్‌స్టెప్ సర్వీసును పొందవచ్చు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts