Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label LAVA. Show all posts
Showing posts with label LAVA. Show all posts

Friday, August 4, 2023

లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ !


లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ వేరియంట్ విడుదల చేసింది. ఇందులో ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం కూడా లావా బ్లేజ్ 5జీలో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్లోనే 4 జీబీ ర్యామ్ ధర రూ.10,999గానూ, 6 జీబీ ర్యామ్ ధర రూ.11,999గానూ ఉంది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై లావా బ్లేజ్ 5జీ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లేను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్గా ఉంది. వైడ్వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్ను కూడా ఇందులో అందించారు. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా మరో 8 జీబీని స్టోరేజ్ నుంచి తీసుకుని ర్యామ్గా మార్చుకోవచ్చు. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు ఏఐ లెన్స్ కూడా లావా బ్లేజ్ 5జీలో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్ లావా బ్లేజ్ 5జీలో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఫాస్ట్ చార్జింగ్ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. లావా బ్లేజ్ 5జీ ఫీచర్లు ఇటీవలే లాంచ్ అయిన లావా బ్లేజ్ ప్రో తరహాలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల 2.5డీ కర్వ్డ్ ఐపీఎస్ హెచ్డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ను ఈ ఫోన్లో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండనుంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మాక్రో, పొర్ట్రెయిట్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.0, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, జీపీఎస్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్లాక్ ఫీచర్ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

Wednesday, August 2, 2023

యువ 2 ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లోకి యువా 2 ప్రో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ యువా 2  ఫోన్ విడుదల చేసింది. యువ 2 కొన్ని ఫీచర్లతో పాత మోడల్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తోంది. సెల్ఫీ కెమెరాతో రెండు ఫోన్‌లు ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టయిల్ నాచ్‌ను కలిగి ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలకు బదులుగా 2 కెమెరా సెన్సార్లు ఉన్నాయి. లావా MediaTekకి బదులుగా Unisoc (Unisoc T606) చిప్‌సెట్‌ని కూడా ఉపయోగిస్తోంది. లావా సింగిల్ 3GB RAM, 64GB స్టోరేజ్ మోడల్ ధర కేవలం రూ. 6,999తో యువ 2ని ప్రవేశపెట్టింది.యువ 2 ప్రో కన్నా లావా యువ 2ని రూ. 1,000 చౌకగా అందిస్తుంది. రెండింటి మధ్య కలర్ ఆప్షన్లను అలాగే ఉంటాయి. కస్టమర్‌లు గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. ఈరోజు నుంచి లావా రిటైల్ నెట్‌వర్క్‌లో యువ 2 అందుబాటులో ఉంటుంది. లావా Yuva 2 ఫోన్ 13MP డ్యూయల్ AI వెనుక కెమెరా, స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అనామక ఆటో-కాల్ రికార్డింగ్ ఫీచర్, నాయిస్ క్యాన్సిలేషన్ డ్యూయల్ మైక్రోఫోన్‌లను కూడా పొందవచ్చు. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. టైప్-C 10W ఛార్జర్‌తో వస్తుంది. లావా కొత్త ‘సింక్’ స్క్రీన్ డిస్‌ప్లేతో 90Hz డిస్‌ప్లే కూడా ఉంది. సింక్ డిస్‌ప్లే 'హై స్క్రీన్-టు-బాడీ రేషియో' 'లోయర్ బెజెల్స్' అందించడంపై దృష్టి పెడుతుందని కంపెనీ వివరిస్తుంది. అయినప్పటికీ, రూ.10వేల సెగ్మెంట్‌లోని స్మార్ట్‌ఫోన్‌లలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఇప్పటికీ ఉంది. లావా వెనుక ప్యానెల్ గాజు లాంటి పదార్థాన్ని ఉపయోగించింది. Yuva 2 ఫోన్ ప్రస్తుతం (Android 12)లో రన్ అవుతుంది. అయితే, కంపెనీ క్లీన్, బ్లోట్‌వేర్ లేని Android ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 స్మార్ట్‌ఫోన్ Android 13 అప్‌డేట్‌ను అందుకుంటుంది. రెండు ఏళ్ల పాటు ఫోన్ త్రైమాసిక భద్రతా అప్‌డేట్‌లను కూడా అందుకుంటుంది. ఇతర లావా ఫోన్ల మాదిరిగానే డివైజ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు లావా Yuva 2 ఫోన్ 'free service at home' సర్వీసుకు అర్హత పొందుతుంది. ఈ ఫోన్ వారంటీ వ్యవధిలోపు డోర్‌స్టెప్ సర్వీసును పొందవచ్చు. https://t.me/offerbazaramzon

Monday, June 26, 2023

తక్కువ ధరలో లావా జెడ్ 21

                                                   

దేశీ మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న లావా పలు రకాల స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. జెడ్ 21 అనే మోడల్ కూడా వీటిల్లో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ. 5,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ. 4899కే కొనొచ్చు. అంటే మీకు 18 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌పై మరే ఇతర ఆఫర్లు అందుబాటులో లేవు. ఈ చౌక ధర ఫోన్‌లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 5 ఇంచుల స్క్రీన్, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ సిమ్ 4జీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై 7 రోజుల రిప్లేస్‌మెంట్ పాలసీ వర్తిస్తుంది. బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలని భావించే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 236 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 304 చెల్లించాలి. ఇంకా ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలో మీరు ఈ ఫోన్ కొనొచ్చు. ఏడాది పాటు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 409 పడుతుంది. ఇంకా 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 545 చెలించాలి. అలాగే 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 817 కట్టాలి. మూడు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1633 పడుతుంది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుందని గుర్తించాలి. క్రెడిట్ కార్డు ఆధారంగా కూడా ఈఎంఐలో మార్పు ఉంటుంది.  https://t.me/offerbazaramzon

Tuesday, May 23, 2023

లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ప్రారంభం !


లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో లావా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మంచి హైప్ ను సంపాదించుకుంది. ఈ ఫోన్ వారెంటీలో భాగంగా లావా తెలిపిన ఫోన్ రీప్లేస్మెంట్ అఫర్, భారతీయ యూజర్లను ఆకట్టుకుంటోదని కూడా చెబుతున్నారు. లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా రూ. 21,999 రేటుతో లాంచ్ చేసింది. అయితే, లంచ్ ఆఫర్ లో భాగంగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పైన అందించింది.  లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి ఫోన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో FHD+ రిజల్యూషన్ కలిగిన Curved AMOLED (6.78 ఇంచ్) డిస్ప్లేతో ఉంటుంది. ఇది HDR 10+ సర్టిఫికేషన్ మరియు ఓలియోఫోబిక్ కోటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా కనిపిస్తుంది మరియు 3D డ్యూయల్ కర్వ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో మీరు 8GB ర్యామ్ ని 8GB వర్చువల్ ర్యామ్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సెటప్ 50MP మైన్ కెమేరా సెటప్ తో కలిగి వుంది. లావా ఈ లేటెస్ట్ ఫోన్ లో వేగవంతమైన 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. 

Tuesday, December 20, 2022

లావా ఎక్స్3 విడుదల !

లావా ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.53-అంగుళాల LCD, డ్యూయల్ రియర్ కెమెరాలు, క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీ దూసుకుపోతోంది.  లావా ఈ అవకాశాన్ని కోల్పోకూడదనుకుంటుంది. అందుకే,తక్కువ ధరలో 3GB RAM+32GB స్టోరేజ్ వెర్షన్ కోసం Lava X3 ధర ₹6,999 లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది Realme C30, Redmi A1+ మొదలైన స్మార్ట్ ఫోన్లకు పోటీగా మార్కెట్లో నిలవనుంది. Lava X3 ఈరోజు నుండి అమెజాన్ ఇండియా ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటుంది. ఓవల్ ఆకారపు కెమెరా ద్వీపాన్ని పొందుతుంది, ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సార్లు మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. దీనిలోని కెమెరా ప్లేస్‌మెంట్ ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది క్వాడ్-కెమెరా సెటప్ వలె కనిపిస్తుంది. వెనుక ప్యానెల్‌లో అమర్చబడిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఉంచడం మంచిది కాదు. ముందు వైపుకు వెళుతున్నప్పుడు, ఇది డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది, ఇది ఈ ధర వద్ద అద్భుతమైన ఫోన్ గా అభివర్ణించారు. పెద్ద 6.53-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఇది స్క్రీన్ చుట్టూ మందపాటి బెజెల్‌లను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ హీలియో A22 చిప్‌సెట్‌తో ఆధారితమైనది, ఇది 12nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై నిర్మించబడింది. దీని ప్రధాన ప్రత్యర్థి, Redmi A1+ కూడా అదే చిప్‌సెట్‌తో ఆధారితమైనది. Lava X3 3GB RAM మరియు 32GB అంతర్గత నిల్వతో అమర్చబడింది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని మరింత విస్తరించుకోవచ్చు. ఆప్టిక్స్ పరంగా, Lava X3 ఫోన్ 8MP ప్రధాన సెన్సార్ మరియు LED ఫ్లాష్ మద్దతుతో VGA సెకండరీ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ విధులను 5MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ నిర్వహిస్తుంది. 4G VoLTE, బ్లూటూత్, Wi-Fi, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-C పోర్ట్ వంటి కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.


Saturday, November 26, 2022

మార్కెట్లోకి లావా బ్లేజ్ NXT విడుదల


లావా బ్లేజ్ NXT మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 4GB + 64GB సింగిల్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. లావా బ్లేజ్ మార్క్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో క్లాసీగా కనిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన లావా బ్లేజ్ మోడల్‌కు సక్సెసర్‌గా కంపెనీ కొత్త ఫోన్‌ను రూపొందించింది. ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G37 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను లావా అందించింది. ఈ డివైజ్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీన్ని టైప్-సి పోర్ట్‌ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఇది కేవలం 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తుంది. వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3GB వరకు పెంచుకోవచ్చు.  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు ఉంటాయి. ఈ కెమెరా సెటప్ 30 fps వద్ద 1080P ఫుల్ HD వీడియోలను రికార్డ్ చేయగలదు. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది. ధర రూ. 9,299గా ఉంది. ఈ ఫోన్ బ్లూ, రెడ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది కానీ దీని సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే లావా బ్లేజ్ NXT డివైజ్‌ అమెజాన్ లిస్టింగ్‌లో కనిపించింది. అంటే త్వరలో అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Tuesday, November 8, 2022

రూ.9,999 కే 5G ఫోన్ !


లావా సంస్థ స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరిస్తూ స్వదేశీ హ్యాండ్‌సెట్ తయారీదారు సరికొత్త ఎంట్రీ లెవల్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. Lava Blaze 5G గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకువస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది మరియు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించారు. ఈ హ్యాండ్‌సెట్ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది మరియు కంపెనీ సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసిన లావా బ్లేజ్ ప్రోని పోలి ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో స్మార్ట్‌ఫోన్ 4G కనెక్టివిటీని అందిస్తుంది మరియు వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ గోల్డ్, గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ ఆరెంజ్ రంగులలో వస్తుంది. లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ ₹10,499 ధర ట్యాగ్‌తో వస్తుంది. లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ధర ₹9,999 గా ఉంది.మరియు గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. 

Friday, October 7, 2022

10 వేలకే లావా బ్లేజ్ 5జీ !


పది రూపాయలకే ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ నుండి Lava లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G మొబైల్ ను కేవలం 10 వేల రూపాయల ధరలో ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇండియాలో 5G సేవలు మొదలవుతున్న వేళ చౌక ధరకే 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడం చాలా గొప్ప పరిణామం. ఈ ఫోన్ దీపావళి పండుగ నాటికీ సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది.


Monday, April 25, 2022

లావా అగ్ని 5జీ పై ఇయర్‌బడ్స్ ఉచితం


గతేడాది రిలీజైన మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీ మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. రిలీజ్ ధరతో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.2,000 తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో పాటు రూ.1,799 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా పొందొచ్చు. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.18,889 లకే  లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.3,000 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ.1,799 విలువైన లావా ప్రోబడ్స్ టీడబ్ల్యూఎస్ ఇన్ ఇయర్ ఇయర్‌బడ్స్ ఉచితంగా పొందవచ్చు.  ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో అల్ట్రా హెచ్‌డీ మోడ్, సూపర్ నైట్ షాట్, GIF మోడ్, ఏఐ మోడ్, బ్యూటీ మోడ్, మాక్రో మోడ్, ప్రో మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, స్లో మోషన్, టైమ్ లాప్స్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ 5జీ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ 11 యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు.

Popular Posts