లావా బ్లేజ్ 2 5 జీ స్మార్ట్ ఫోన్ విడుదల !
Your Responsive Ads code (Google Ads)

లావా బ్లేజ్ 2 5 జీ స్మార్ట్ ఫోన్ విడుదల !


లావా ఈరోజు కొత్త 5 జీ ఫోన్లాంచ్ చేసింది. ఇప్పటికే అతి తక్కువ ధరలో గొప్ప 5G ఫోన్లను అందించిన ఈ ఇండియన్ బ్రాండ్ ఇప్పుడు మరింత చవక ధరకే ట్రెండీ ఫీచర్లతో లావా బ్లేజ్ 2 5 జీ  స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. లావా ఈ కొత్త 5 స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ట్రెండీ ఫీచర్లతో కేవలం 10 వేల ధరలో తీసుకు రావడం విశేషం.  లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ ను లావా కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ చేసింది. ఈ ఇది స్టార్టింగ్ వేరియంట్ (4GB + 64GB) వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 10,999. నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ MediaTek Dimensity 6020 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. దీనికి జతగా 4GB/6GB RAM మరియు 64GB/128GB (UFS 2.2) ఇంటర్నెల స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్ మరియు గ్లాస్ లావెండర్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. Slow Motion, Timelapse, UHD మరియు Night మోడ్ వంటి చాలా కెమేరా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog