Ad Code

అమెజాన్ లో లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ !


లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ రూ. 19,999 రేటుతో లిస్టింగ్ చేసింది. ఈ లావా ఫోన్ పైన రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ను ఈరోజు అమెజాన్ అందించింది. ఈ కూపన్ ద్వారా ఈ లావా ఫోన్ ను రూ. 18,499 రూపాయలకే పొందవచ్చు. OneCard Credit Card EMI ఆఫర్ తో ఈ ఫోన్ కోన్ వారికి రూ. 1,200 రూపాయల డిస్కౌంట్, Amex Credit Card EMI తో ఈ ఫోన్ కోన్ వారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత చవక ధరకే లభిస్తుంది. లావా అగ్ని 2 5జి ఇండియాలో Dimensity 7050 ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోన్. ఇది 8GB RAM + 8GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 120 Hz రిఫ్రెష్ రేట్ 6.78 ఇంచ్ Curved AMOLED డిస్ప్లేని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించింది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని Clean Android 13 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్లో వెనుక 50MP+ 8MP + 2MP + 2MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ లావా ఫోన్ లో 4700mAh బ్యాటరీని 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Post a Comment

0 Comments

Close Menu