Ad Code

రైన్ వాటర్ టచ్ టెక్ తో వన్ ప్లస్ ఏస్ 2 ప్రో !


వన్ ప్లస్ రైన్ వాటర్ టచ్ టెక్ ని ఆవిష్కరిస్తుంది.  ఈ కొత్త రైన్ వాటర్ టచ్ టెక్ ను ఇది ఎలా పని చేస్తుందనే వివరాలను చైనా లో ప్రదర్శించింది. ప్రసుత ఆధునిక స్మార్ట్ ఫోన్లు సైతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్క్రీన్ పైన నీటి తుంపర్లు ఉండగా ఫోన్ డిస్ ప్లే సరిగా పనిచేయక పోవడం. వన్ ప్లస్ ఈ సమస్య కు సరైన పరిస్కారంగా ఈ కొత్త రైన్ వాటర్ టచ్ టెక్ ను తీసుకు వచ్చింది. చైనా లో ప్రదర్శించిన ఈ టెక్ ఆవిష్కరణ వీడియోలో ఐఫోన్  ప్రీమియం స్మార్ట్ ఫోన్ లు సైతం డిస్ప్లే పైన నీరు ఉన్నప్పుడు అవి ఖచ్చితత్వాన్ని అందించడంలో ఇబ్బంది పడినట్లు తెలిపింది. వాటర్ డిస్ప్లే పైన ఉన్నప్పుడు డిస్ప్లేలు సరిగ్గా స్పందించక పోవడానికి తగిన కారణాలను కూడా వన్ ప్లస్ ఇందులో వివరించింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త టెక్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టినట్లు తెలిపింది. అంతేకాదు, ఈ కొత్త టెక్ తో వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ కూడా ప్రకటించింది. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈ రైన్ వాటర్ టచ్ టెక్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ చైనా లో ఇప్పటికే లాంచ్ అయ్యింది మరియు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్క డిస్ప్లే పరంగా మాత్రమే కాదు అల్రౌండ్ ప్రీమియం ఫీచర్లతో చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో  స్మార్ట్ ఫోన్ 150W హెవీ ఫాస్ట్ ఛార్జ్, Snapdragon 8 Gen 2 ప్రోసెసర్, 24GB LPDDR5X ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్, 3D AMOLED డిస్ప్లే, 50MP Sony IMX890 మెయిన్ కెమేరా కలిగి 8K వీడియోలను చిత్రీకరించ గల సూపర్ కెమేరా మరియు మరిన్ని ఫీచర్లతో వన్ ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu