చంద్రుడి గుట్టు విప్పేందుకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియ విజయవంతైనట్లు ఇస్రో ప్రకటించింది. ఇక ఇప్పటి నుంచి ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. శుక్రవారం.. ల్యాండర్ మాడ్యూల్‌ను డీబూస్ట్ చేసి కక్ష్య తగ్గించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత.. ల్యాండ్ మాడ్యూల్ 'థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్' అని ఓ మెసేజ్ పంపినట్లు ఇస్రో ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్) వేదికగా తెలిపింది. శుక్రవారం ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించనుంది. ఆ తర్వాత 20న మరోసారి ల్యాండర్ మాడ్యూల్ డీ-ఆర్బిట్-2 ప్రక్రియ చేపడుతారు. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌ను జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రక్రియను చేపడతారు. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగేలా నిర్దేశించారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు. అలా క్రమంగా వేగం తగ్గించి.. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ల్యాండర్ ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను మృదువుగా దింపనున్నారు.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment