హానర్ ఎలెక్ట్రానిక్ కంపెనీ మార్కెట్ లోకి మంచి ఫీచర్లు కలిగిన మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది. హానర్ వాచ్ 4 పేరుతో ఈ వాచ్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇక ఇప్పుడు రానున్న వాచ్ కోసం కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఈ వాచ్ లుక్, ఫీచర్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హానర్ వాచ్ 4లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.75 ఇంచెస్ అమోఎల్‌ఈడి డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 390 x 450 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత.. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ అందించారు. దీనిద్వారా నేరుగా వాచ్‌తోనే కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్స్ కూడా స్పీకర్ సహాయంతో మాట్లాడుకోవచ్చు.. వీటి లుక్, కలర్ ఈ వాచ్ ల ప్రత్యేకతను చూపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హార్ట్‌బీట్ మానిటర్, రక్త ఆక్సిజన్ స్థాయి సెన్సార్‌లు, స్లీప్ మానిటరింగ్ సెన్సార్, స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లను అందించారు. మరో విషయమేంటంటే ఈ స్మార్ట్ వాచ్‌లో 5ATM వరకు వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. దీంతో నీటిలో ఉపయోగించినా ఈ వాచ్ పాడవదు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం.. ఇక ఈ వాచ్ లను ఎప్పుడు మార్కెట్ లోకి విడుదల చేస్తారో చూడాలి.. మొత్తానికి విడుదలకు ముందే మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment