Ad Code

బ్లూటూత్ 5.3 విడుదల !


బ్లూటూత్ ప్రతీ డిజిటల్ యూజర్ జీవితంలో భాగమైపోయింది. వైర్‌లెస్ ఆడియో స్ట్రీమింగ్, ఫైల్స్ ట్రాన్స్‌ఫర్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్‌ చేయాలంటే బ్లూటూత్ టెక్నాలజీనే యూజర్లు వినియోగించాల్సి వస్తోంది. కీబోర్డ్, మౌస్, మొబైల్ యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా ఈ టెక్నాలజీ అవసరం. ఈ కనెక్టివిటీ టెక్నాలజీ గత కొన్ని సంవత్సరాలుగా మెరుగుపడుతూ వస్తోంది. రీసెంట్‌గా 5.3 పేరుతో బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పాత వెర్షన్‌ల కంటే ఎక్కువ స్పీడ్‌, రేంజ్ ఆఫర్ చేస్తుంది. బ్లూటూత్ వైర్‌లెస్ టెక్నాలజీ ఫైల్స్‌, డేటాను తక్కువ దూరాలల్లో సమర్థవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇది 2.402 & 2.480 GHz లేదా 2.400 & 2.4835 GHz వంటి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తుంది. కమ్యూనికేషన్ కోసం మాస్టర్-స్లేవ్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడుతుంది. బ్లూటూత్ 5.0 వెర్షన్ 2016లో అందుబాటులోకి వచ్చింది. ఇది బ్లూటూత్‌ లో ఎనర్జీ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ వేగాన్ని 2 Mbit/sకి రెట్టింపు చేసింది. కానీ రేంజ్‌ను తగ్గించింది. ఇది రెండు డివైజ్‌లను ఏకకాలంలో కనెక్ట్ చేయడానికి వీలు కల్పించింది. పెరిగిన వేగం, పరిధి, డేటా ట్రాన్స్‌ఫర్‌తో బ్లూటూత్ 4.2ను అధిగమించింది. 2021, జులై నెలలో విడుదలైన లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్ 5.3 బ్లూటూత్ వెర్షన్, 5.0 కంటే మంచి బ్యాటరీ లైఫ్, సమర్థవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్, ఫాస్ట్ డివైజ్ స్విచింగ్ వంటి అనేక ఇంప్రూవ్‌మెంట్స్ ఆఫర్ చేసింది. బ్లూటూత్ 5.3 బ్లూటూత్ 5.0 కంటే రెండింతలు వేగవంతమైన 2 Mbps వరకు మెరుగైన డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అందిస్తుంది. ఓపెన్ ఎయిర్‌లో 400 మీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తోంది. ఇది బ్లూటూత్ 5.0 కంటే రెండింతలు ఎక్కువ. మెరుగైన ఎన్‌క్రిప్షన్, డివైజ్ డిటెక్షన్ ప్రొటెక్షన్ అందించడమే కాక బ్లూటూత్ 5.3 పాత బ్లూటూత్ వెర్షన్‌లకు సపోర్టు ఇస్తుంది.బ్లూటూత్ 5.3 ఛానల్ క్లాసిఫికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్, ఎన్‌క్రిప్షన్ కీ సైజు కంట్రోల్ ఎన్‌హాన్స్‌మెంట్, కనెక్షన్ సబ్‌రేటింగ్‌తో సహా అనేక మెరుగుదలలను అందిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌లు బ్లూటూత్ కనెక్షన్‌ల మొత్తం పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి. ఈ ఇంప్రూవ్‌మెంట్స్‌తో బ్లూటూత్‌ 5.3 మరింత యూజర్ ఫ్రెండ్లీగానూ మారింది. త్వరలోనే దీనిని మించిన ఫీచర్లతో బ్లూటూత్ 5.4 రానుంది. 

Post a Comment

0 Comments

Close Menu