Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, August 17, 2023

సోషల్ మీడియాలో 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే సెలబ్రిటీలే !


సెలబ్రిటీలంటే సినిమా నటులు, క్రీడాకారులే కాదు, సోషల్ మీడియాలో చలాకీగా ఉండేవారికి కూడా సెలబ్రిటీ హెూదా దక్కబోతోంది. సోషల్ మీడియాలో 5 లక్షలకు పైగా ఫాలోయర్లున్న వ్యక్తులను కూడా సెలబ్రిటీలుగా పిలవచ్చని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన ప్రచారానికి సెలబ్రిటీలతో ప్రకటనలు ఇస్తుంటారు. ఇప్పటివరకు ఇందులో క్రీడాకారులు. సినిమా యాక్టర్లే ఉంటున్నారు. అయితే డిజిటల్ మీడియా రాకతో ఈ సెలబ్రిటీ స్టేటస్ కు సంబంధించిన నిర్వచనాన్ని మార్చడానికి ఏఎసీసీఐ సవరణ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లను సెలబ్రిటీలుగా పరిగణించబోతున్నారు. అయితే ఇందుకోసం ఏదైనా ఓ సింగిల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో కనీసం 5 లక్షల మంది ఫాలోయర్లు ఉండాలి. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను అడ్వర్టైజ్‌మెంట్లలో సెలబ్రిటీల్లా వాడుకోవచ్చన్నమాట.

No comments:

Post a Comment

Popular Posts