Ad Code

వీఐ 5 జీ సేవలు త్వరలో ప్రారంభం !


జియో ఆగమనం తర్వాత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. డేటా తక్కువ ధరకే వినియోగదారుల చెంతకు చేరింది. జియో దెబ్బకు మిగిలిన కంపెనీలు కూడా డేటా చార్జీలు తగ్గించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్‌డేట్స్‌ భాగంగా టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌ ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు అందిస్తున్నాయి. అయితే మూడో టెలికాం దిగ్గజం వీఐ మాత్రం ఇప్పటికి కూడా 5 జీ సేవలను ప్రారంభించలేదు. జియో, భారతి ఎయిర్‌టెల్ భారతదేశంలోని మొత్తం 22 టెలికాం సర్కిల్‌లో 5జీ సేవల కనీస రోల్ అవుట్ బాధ్యతను పూర్తి చేసింది. తాజాగా మూడో టెలికాం దిగ్గజం వోడాఫోన్‌ ఐడియా (వీఐ) పూణేలో 26 జీహెచ్‌జెడ్‌, 3.3జీహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌లో 5జీని విజయవంతంగా పరీక్షించింది. పూణేలోని ఘోల్ రోడ్‌లో మహారాష్ట్ర ఎల్‌ఎస్‌ఏ పూణే 16 ఆగస్టు 2023న విజయవంతంగా పూర్తి చేసింది అని మహారాష్ట్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం పేర్కొంది. మహారాష్ట్ర ఎల్‌ఎస్‌ఏ మహారాష్ట్ర (ముంబై మినహా), గోవాలో టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ఐఎస్‌పీ) పాలించే బాధ్యతను కలిగి ఉంది. ఇటీవల రిలయన్స్ జియో ప్రతి 22 లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియాస్ (ఎల్‌ఎస్‌ఏ)లో కనీస రోల్-అవుట్ బాధ్యతలను పూర్తి చేసినట్లు ప్రకటించింది. జియో జూలై 19న డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) యూనిట్‌లతో ఫేజ్ 1 మినిమమ్ రోల్‌అవుట్ ఆబ్లిగేషన్‌ను పూర్తి చేయడానికి నిర్దేశించిన వివరాల సమర్పణను పూర్తి చేసింది. ఆగస్ట్ 11 నాటికి అన్ని సర్కిల్‌లలో అవసరమైన డీఓటీ టెస్టింగ్ పూర్తయింది. ఇది 5జీని అందజేస్తుందని జియో ప్రకటించింది. అయితే డీఓటీ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అన్ని టెలికాం సర్కిల్‌లలో 26జీహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌లో 5జీ సేవలను ప్రవేశపెట్టే కనీస రోల్-అవుట్ బాధ్యతను పూర్తి చేసినట్లు ఎయిర్‌టెల్‌ కూడా ప్రకటించింది. సెప్టెంబరు 2023 నాటికి 5జీ సేవలతో ప్రతి పట్టణం, కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కవరేజీని అందించే దిశగా ఎయిర్‌టెల్ పనిచేస్తున్నట్లు తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu