Ad Code

చైనాలో రియల్‌మీ జీటీ 5 విడుదల !


చైనాలో రియల్‌మీ  జీటీ 5 స్మార్ట్ ఫోన్ సోమవారం లాంచ్ అయింది. ఇందులో క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ను అందించారు. 24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం రెండు ఫోన్లు మాత్రమే 24 జీబీ ర్యామ్ తో లాంచ్ అయ్యాయి. రియల్‌మీ జీటీ 5 ఈ జాబితాలో మూడో ఫోన్. వన్ప్లస్ ఏస్ 2 ప్రో, నుబియా రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో ప్లస్ మొబైల్స్ మొదటి రెండు ఫోన్లు. 240W ఫాస్ట్ ఛార్జింగ్ను 24 జీబీ ర్యామ్ వేరియంట్ సపోర్ట్ చేయనుంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,400) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా (సుమారు రూ.37,800) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 3,799 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. ఫ్లోయింగ్ సిల్వర్, ఇల్యూషన్ మిర్రర్, స్టారీ ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనాలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా రియల్మీ జీటీ సిరీస్ సక్సెస్ఫుల్ కాబట్టి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 93.7 శాతంగా ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ కానుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ కూడా అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, నావిక్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12 జీబీ, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్లలో 5240 ఎంఏహెచ్ బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. టాప్ ఎండ్ మోడల్ అయిన 24 జీబీ ర్యామ్ వేరియంట్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240W ఫాస్ట్ ఛార్జింగ్ను అందించారు. దీని మందం 8.9 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu