Ad Code

పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ 5 నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్ !


పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లో ఈ స్మార్ట్‌ఫోన్లు మొత్తం అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని పోకో ఇండియా హెడ్ హిమాన్షు టండన్ ట్విట్టర్‌లో వెల్లడించారు. దేశంలో లభిస్తున్నఅతి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. పోకో ఎం6 ప్రో 5జీ మొబైల్‌లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, 50MP డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రెడ్‌మీ 12 5జీ మొబైల్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 5జీ ప్రాసెసర్‌తో పోకో ఎం6 ప్రో 5జీ వచ్చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తున్నాయి.  పోకో ఎం6 ప్రో 5జీ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను కేవలం రూ.9,999 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు అమ్ముడుపోయింది.  పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది.  పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండు ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ వాడుకోవచ్చు.  పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu