Ad Code

త్వరలో లాంచ్ కానున్న గూగుల్ పిక్సెల్ 8


గూగుల్ త్వరలో లాంచ్ చేయనున్న పిక్సెల్ ఫోన్ గీక్బెంచ్ లో 'అకిటా' అనే కోడ్ నేమ్ తో కనిపించింది. ఇందులో కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్షిప్ చిప్సెట్ ను అందించనుంది. ఈ ఫోన్ టెన్సార్ జీ3 చిప్సెట్ ప్రాసెసర్ తో రానుంది. గూగుల్ పిక్సెల్ 7ఏకి తర్వాతి వెర్షన్ గా ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను పొందుతారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో లాంచ్ కానుంది. గూగుల్ పిక్సెల్ 8ఏలో మీరు మెరుగైన కెమెరా, డిజైన్ ను చూడవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అవ్వడానికి ముందు గూగుల్ పిక్సెల్ 7 తర్వాతి వెర్షన్ గా రానున్న పిక్సెల్ 8 సిరీస్ ను లాంచ్ చేయనుంది. భారతదేశంలో పిక్సెల్ 7 ధర ప్రస్తుతం రూ. 49,999గా నిర్ణయించారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మార్కెట్లోకి రానుంది. 6.3 అంగుళాల పంచ్ హోల్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది. మ్యాగ్జిమమ్ బ్రైట్నెస్ 1400 నిట్స్ వరకు ఉండటం విశేషం. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 12 మెగాపిక్సెల్ ఎల్ఏ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్న పిక్సెల్ 7లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 10.8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. వెనుక, ముందు కెమెరాలు రెండూ 4కే వీడియోలను పిక్చరైజ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లీక్లను బట్టి చూస్తే రాబోయే గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో కెమెరాలకు ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. రెండు ఫోన్లలో 'అసిస్టెంట్ వాయిస్ రిప్లై' ఫీచర్ కూడా అందుబాటులో ఉండనుంది. పిక్సెల్ 8 ప్రో ద్వారా ఇన్కమింగ్ మెసేజ్ లకు ఆటోమేటిక్ గా రిప్లై ఇవ్వవచ్చని కూడా చెబుతున్నారు. మరోవైపు గూగుల్ తమ వినియోగదారులకు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. చాలా కాలం నుంచి యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఈ ఏడాది(2023) డిసెంబర్ 1వ తేదీ నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ యూజర్లకు జీమెయిల్ ద్వారా హెచ్చరిక మెసేజ్ ను గూగుల్ పంపించింది. గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కు ఇన్ యాక్టివ్ పరిమితిని రెండు సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. అంటే వినియోగదారులు రెండు సంవత్సరాల పాటు గూగుల్ అకౌంట్స్ వినియోగించకపోతే లేదంటే యాక్టివ్ గా ఉంచకపోతే వాటిని కంపెనీ పర్మినెంట్ గా తొలగిస్తుంది. అయితే నేరుగా గూగుల్ అకౌంట్ కి లాగిన్ అవ్వకుండా గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసుల కోసం గూగుల్ అకౌంట్ ను వినియోగిస్తారో వారికి ఈ తొలగింపు ఉండదని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu