Ad Code

ఎయిర్‌టెల్ సరికొత్త రూ.99 ప్లాన్ !


యిర్‌టెల్ కొత్త రూ.99 అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు సౌకర్యవంతమైన, సరసమైన టారిఫ్ ఆప్షన్ అందించడమే కాకుండా కంపెనీకి సగటు ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 99 అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్ యాడ్-ఆన్ ప్లాన్‌గా రూపొందించింది. వినియోగదారులు తమ రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్ పూర్తి చేసిన తర్వాత ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ యూజర్లకు ఒక రోజు వ్యాలిడిటీ వ్యవధికి అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అయినప్పటికీ, అన్‌లిమిటెడ్ డేటా సదుపాయానికి పరిమితి ఉంది. అన్‌లిమిటెడ్ డేటా 30GB ఫెయిర్ యూసేజ్ పాలసీకి లోబడి ఉంటుంది. 30GB హై-స్పీడ్ డేటా తర్వాత ఎయిర్‌టెల్ యూజర్లు 64Kbps వద్ద అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించడం కొనసాగించవచ్చు. అదనంగా, డేటా ప్యాక్ బెనిఫిట్స్ ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ అవసరమని గమనించాలి. ఎయిర్‌టెల్ 5G ప్లస్ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్, ఎయిర్‌టెల్ ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్ ఉన్న యూజర్లు రోజువారీ పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటాను ఆస్వాదించవచ్చు. అయితే, 5G యేతర ప్రాంతాల్లో కొత్త రూ. 4G హ్యాండ్‌సెట్‌ని ఉపయోగించే వారికి 99 డేటా ప్యాక్ గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. అదనపు హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu