Ad Code

ఐక్యూ 9 ప్రో ప్రీమియం మోడల్‌పై భారీ డిస్కౌంట్ !

                                                 

క్యూ 9 ప్రో ప్రీమియం మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో కాకుండా కంపెనీ సైట్‌లోనే డైరెక్ట్‌గా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐక్యూ ఫోన్‌పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 79,990గా ఉంది. దీన్ని రూ. 39,990కే కొనొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే అదనంగా రూ. 5 వేల డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే అప్పుడు డిస్కౌంట్ ఏకంగా రూ. 40 వేలకు చేరుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 8 వరకు ఐక్యూ  ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది. సూపర్ స్పీడ్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. కేవలం 8 నిమిషాల్లోనే బ్యాటరీ 50 శాతం ఎక్కుతుంది. అలాగే 18 నిమిషాల్లో బ్యాటరీ 100 శాతం ఫుల్ అవుతుంది. ఇంకా ఇందులో 3డీ అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ జీఎన్5 గింబల్ కెమెరా, 2కే ఈ5 అమొలెడ్ డిస్‌ప్లే, డ్యూయెల్ స్టీరియో స్పీకర్లు, కర్వ్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌పై నో కీస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా పొందొచ్చు. 15 రోజుల పాటు రిప్లేస్‌మెంట్ పాలసీ ఉంది. అందువల్ల మీరు మీ ఫోన్‌ను ప్రాబ్లమ్ ఉంటే కొత్తది పొందొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu