Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, August 10, 2023

ఏఐ పట్ల భయం కాకుండా ఇష్టం పెంచుకోవాలి !


ర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు శరవేగంగా డెవలప్ అవుతూ ఉంది. అయితే ఇది కొంతమందికి ప్రొడక్టివ్‌గా ఉపయోగపడుతుంటే మరికొంతమందిని మాత్రం అయోమయంలోకి నెట్టేస్తుంది. టెక్ రంగంలో ఉన్న చాలామంది యువతలో ఏఐ.. కొత్త భయాలు రేకేస్తుందట. ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, కొత్త ఉద్యోగావకాశాలు రావని చాలామంది బెంగ పెట్టుకుంటున్నారట. దీనికే నిపుణులు 'ఏఐ యాంగ్జైటీ' అని పేరు పెట్టారు. చాట్‌ జీపీటీ వచ్చినప్పటి నుంచి చాలామంది యువతలో కొత్త భయాలు మొదలయ్యాయి. ఒక సర్వే ప్రకారం 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లలో చాలామంది తమ కెరీర్‌ గురించి భయపడుతున్నారని తేలింది. మరోపక్క ఏఐ వల్ల 2025 కల్లా 85 మిలియన్‌ ఉద్యోగాలు భర్తీ అవుతాయని 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం' అంచనా వేస్తుంది. దీంతో యువతలో చాలామంది ఏఐ గురించి భయపడుతున్నారు. అయితే ఏఐ గురించి భయం అక్కర్లేదని తగిన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఇంకా మెరుగైన అవకాశాలు పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. యువతలో ఏఐ యాంగ్జైటీని తొలగించడానికి 'ఫోర్బ్స్‌ కోచెస్‌ కౌన్సిల్‌' సభ్యులు కొన్ని టిప్స్ చెప్పారు. ఏఐ పట్ల భయం కాకుండా ఇష్టం పెంచుకోమని వాళ్లు సూచిస్తున్నారు. ఏఐకు సంబంధించిన కొత్త స్కిల్స్ నేర్చుకోమంటున్నారు. అలాగే మనిషికి ఉండే సహజమైన తెలివితేటలు, స్కిల్స్‌ను ఏఐ ఎప్పటికీ రీప్లేస్‌ చేయలేదని, మనిషికి ఉండే కమ్యూనికేషన్‌ స్కిల్స్,స్ట్రాటెజీ స్కిల్స్, క్రియేటివిట్ స్కిల్స్.. మెషీన్స్ ఎప్పటికీ అనుకరించలేవని చెప్తున్నారు. ఇక వీటితోపాటు ఏఐ యాంగ్జైటీని పోగొట్టుకోవాలంటే ఉద్యోగం విషయంలో ఫ్లెక్సిబుల్‌గా ఆలోచించాలి. ఎప్పుడైనా కొత్త ఉద్యోగంలోకి మారడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు సుముఖంగా ఉండాలి. ఏఐ చేయలేని పనులు, ఏఐ అడుగుపెట్టలేని రంగాల వైపు దృష్టి సారించినా మంచిదే. దాంతోపాటు ఏఐతో పని చేయించడం ఎలా అన్న స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే రకరకాల ఏఐ టూల్స్‌లో ఎక్స్ పర్ట్ అవ్వాలి. అప్పుడు ఏఐ రంగంలోనే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందొచ్చు.

No comments:

Post a Comment

Popular Posts