Ad Code

అంతరిక్షానికి ఇస్రో వ్యోమమిత్ర !


ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ లో మహిళా రోబో వ్యోమమిత్రను పంపబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గగన్‌యాన్ మొదటి ట్రయల్ రన్ అక్టోబర్‌లో మొదటి లేదా రెండో వారంలో జరుగుతుంది.  భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే గగన్‌యాన్ లక్ష్యం. ట్రయల్ రన్ సక్సెస్ అయ్యాక మహిళా రోబో వ్యోమమిత్రను ఉంచి అంతరిక్షంలోకి పంపుతారు. ఈ రోబోని ఇస్రో శాస్త్రవేత్తలే తయారుచేశారు. ఇది అచ్చం మనిషిలాగానే ప్రవర్తిస్తుంది. మాట్లాడుతుంది, స్పందిస్తుంది, హావభావాలు పలికిస్తుంది, పనులు చేస్తుంది. అందువల్ల ఈ రోబో గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లి  ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడుతుంది. వాళ్లు చెప్పిన పనులను రోదసిలో పూర్తి చేసి తిరిగి భూమికి వస్తుంది. వ్యోమమిత్ర ప్రయోగం సక్సెస్ అయితే ఆ తర్వాత మానవ వ్యోమగాముల్ని 2024 లేదా 2025లో అంతరిక్షం లోకి పంపుతారు. ఇది సక్సెస్ అవ్వడం ద్వారా అమెరికా, రష్యా , చైనా తర్వాత స్పేస్ ఫ్లైట్‌లో వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. 


Post a Comment

0 Comments

Close Menu