Ad Code

సాధారణ బ్యాటరీలకూ, రీఛార్జ్ బ్యాటరీలకూ తేడా ?


నం వాడేవాటిలో బ్యాటరీలు ఒకటి. వీటిలో 2 రకాలు మనకు బాగా తెలుసు. ఒక రకం ఒకసారి మాత్రమే వాడి పారేసేవి. రెండో రకం మళ్లీ మళ్లీ వాడుకునేందుకు వీలు ఉండే రీఛార్జ్ బ్యాటరీలు. ఒకసారి మాత్రమే వాడేది తక్కువ ధర ఉంటుంది. రీఛార్జ్ బ్యాటరీ ధర దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అన్ని బ్యాటరీలనూ రీఛార్జ్ చేసుకునేలా తయారుచెయ్యరు. ఎందుకంటే.. క్లాక్, రిమోట్ కంట్రోల్, టార్చ్‌లైట్ వంటి వాటిలో వాడే బ్యాటరీ 6 నెలల నుంచి సంవత్సరం వస్తుంది. సంవత్సరం తర్వాత.. అది తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. దాని కాలపరిమితి ముగిసిపోయినట్లే. అందువల్లే అలాంటి వాటిని ఒకసారి వాడి పారేసేలా తయారుచేస్తారు. వాటి ధర తక్కువ ఉంటుంది కాబట్టి.. మనం వాటిని కొనుక్కుంటాం. రీఛార్జ్ చేసుకోతగ్గ బ్యాటరీలు 100 నుంచి 300 సార్లు రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటిని కెమెరాలు, గేమింగ్ రిమోట్ కంట్రోల్, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటి వాటిలో వాడుతాం. వాడకం ఎక్కువ కాబట్టి.. ధర ఎక్కువైనా అవసరానికి తగ్గట్టు వీటిని కొనుక్కుంటాం.  అన్నీ రీఛార్జ్ బ్యాటరీలే ఉన్నా కుదరదు, అన్నీ సింగిల్ యూజ్‌వే ఉన్నా కుదరదు. మరి వీటిలో ఈ తేడా ఎందుకు? సాధారణ బ్యాటరీలను మళ్లీ మళ్లీ ఎందుకు రీఛార్జ్ చెయ్యలేం? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. అసలు ఈ బ్యాటరీల తయారీలో ఉండే తేడా మనకు తెలియాలి. బ్యాటరీలు.. రసాయనిక శక్తినీ, కరెంటునీ కనెక్ట్ చేస్తాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలలో.. అధిక శక్తి ఉండే రసాయనాలు.. కొద్దికొద్దిగా శక్తిని విడుదల చేసేవిగా మారతాయి. అందువల్ల ఇవి దీర్ఘకాలం మన్నుతాయి. వీటిని గాల్వానిక్ ఘటాలు అని కూడా అంటారు. కొన్ని నెలల తర్వాత వీటిలో రసాయనిక శక్తి అయిపోతుంది. రీఛార్జ్ బ్యాటరీలలో ప్రత్యేకమైన రసాయనిక శక్తి ఉంటుంది. దీనికి కరెంటును కనెక్ట్ చెయ్యగానే... ఈ శక్తి చాలా ఎక్కువగా పెరిగి.. అధిక శక్తిగా మారుతుంది. అలా మారిన శక్తిని మనం వాడేసుకోగానే.. ఆ శక్తి తిరిగి.. తక్కువ శక్తి రసాయనంగా మారిపోతుంది. ఇలా రీఛార్జ్ చేసిన ప్రతిసారీ జరుగుతుంది. ఐతే, వీటికి కూడా ఎక్స్‌పైరీ ఉంటుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఇవి కూడా పనిచేయవు.

Post a Comment

0 Comments

Close Menu