Ad Code

ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డు కాంటెస్ట్ !


యాపిల్ తిరిగి ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డు కాంటెస్ట్ తీసుకొచ్చింది. ఇందులో విజేతగా నిలిచి వారికి బంగారం , యాపిల్ ప్రొడక్టులు ఉచితంగానే లభిస్తాయి. 2007 నుంచి కాంటెస్ట్ జరుగుతూ వస్తోంది. ఇది యాపిల్ అధికారిక ఈవెంట్ కాదు. కానీ ఐఫోన్ ఫోటోగ్రఫీ ఆర్ట్ పురస్కరించుకొని ఈ కాంటెస్ట నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్, ఐపాడ్ యూజర్లు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఐఫోన్ లేదా ఐపాడ్‌తో తీసిన ఫోటోలను ఈ కాంటెస్ట్‌కు పంపొచ్చు. మీరు పంపిన ఫోటో ఈ కాంటెస్ట్‌లో గెలిస్తే బెనిఫిట్స్ లభిస్తాయి. మీ ఫోటోలను ఎడిట్ చేస్తే వాటిని కాంటెస్ట్‌లోకి తీసుకోరు. అంటే ఫోటో షాప్‌లో లేదంటే ఇతర ఫోటో యాప్స్ ద్వారా ఫోటోలను ఎడిట్ చేయకూడదు. ఐఫోన్ ద్వారా తీసిన ఫోటోలను అలాగే కాంటెస్ట్‌కు పంపాల్సి ఉంటుంది. గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌కు ఐపాడ్ ఎయిర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే టాప్ 3 విజేతలకు ఒక్కొక్కరికి యాపిల్ వాచ్ లభిస్తుంది. అంతేకాకండా 14 కేటగిరిలలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వారికి గోల్డ్ బార్ కూడా లభిస్తుంది. ప్రైవేట్ మింట్ సంస్థ నుంచి ఈ బంగారం పొందొచ్చు. అలాగే రెండు, మూడో స్థానంలో ఉన్న వారికి ప్లాటింన బార్ కూడా లభిస్తుంది. ఈ ఫోటో గ్రఫీ కాంటెస్‌లో చాలా కేటగిరిలు ఉంటాయి. అనిమల్స్, అర్కిటెక్చర్, చిల్ట్రన్, సిటీ లైఫ్, ల్యాండ్ స్కేప్, లైఫ్‌స్టైల్, నేచర్, పీపుల్, పొట్రేట్, ట్రావెల్ ఇలా పలు రకాల కేటగిరీలు ఉన్నాయి. మీరు మీ ఫోటోలను మీకు నచ్చిన కేటగిరి కింద పంపొచ్చు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావించే వారు ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ధర రూ. 470 నుంచి ఉంటుంది. ఫోటోల సబ్‌మిట్‌కు 2024 మార్చి 31 వరకు గడువు ఉంటుంది. అందువల్ల మీరు కూడా ఈ ఫోటో గ్రపీ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావిస్తే.. వెంటనే అదిరే ఫోటోలను పంపొచ్చు. బంపర్ బహుమతులు సొంతం చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu