Ad Code

ఊబర్ సీఈవోకే షాక్ ఇచ్చిన సర్జ్ ప్రైస్ !


బిజీ టైమ్ లో ఒకలా, మామూలు టైమ్ లో ఒకలా ఛార్జీలు తీసుకుంటున్నాయి క్యాబ్ సర్వీసులు. అందులో ఊబర్ ఎప్పుడూ రెండాకులే ఎక్కువే చదివుతుంది. ఎప్పుడూ సర్జ్ ప్రైస్ పేరుతో డబుల్ ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటుంది. అలా ఒక రైడ్ కు వసూలు చేసిన మొత్తం ఊబర్ సీఈవోనే ఆశ్చర్యపోయేలా చేసింది. తక్కువ మంది డ్రైవర్లు ఉండి, ఎక్కువ రైడ్ లు ఉన్నప్పుడు లేదా బాగా బిజీ టైమ్ లో క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కంపెనీలు సర్జ్ ప్రైస్ లు వసూలు చేస్తారు. అలా న్యూయార్క్ లో ఒ రైడ్ లో మూడు మైళ్ళ దూరానికి 52 డాలర్లు వసూలు చేసింది ఊబర్. అది కూడా ఊబర్ సీఈవోను ఇంటర్వ్యూ చేసేందుకు వెళుతున్న ఓ జర్నలిస్ట్ దగ్గరే. టిప్ తో కలిపి 52 డాలర్లు చెల్లించిన జర్నలిస్ట్, ఊబర్ సీఈవో ఖోస్రో షాషి దగ్గరకు వెళ్ళిన తర్వాత తన రైడ్ ఛార్జీలు ఎంత అయి ఉంటాయో గెస్ చేయమని అడిగారు. దానికి ఖోస్రో మూడు మైళ్ళ దూరానికి 20 డాలర్లు అయి ఉంటాయి అని చెప్పారు. అప్పుడు మెల్లగా జర్నలిస్ట్ తాను చెల్లించిన డబ్బుల గురించి చెప్పారు. అది వినగానే ఖుస్రో నోరు వెళ్లబెట్టారు. అప్పుడు సర్జ్ ఛార్జీల గురించి జర్నలిస్ట్ ఊబర్ సీఈవోకు చెప్పారు. వాటికి అసలు అర్ధమే లేదంటూ విమర్శించారు. దాంతో ఏం చెప్పాలో తెలియని ఖుస్రో అధిక ధరలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. రెసిషన్ వల్ల అన్ని ధరలు పెరిగాయని...డ్రైవర్ల శ్రమకు తగిన ఫలం ఇవ్వడానికే ధరలు పెంచామని చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఓ పత్రికలో కథనంగా ప్రచురితమైంది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీదన చర్చ జరుగుతోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ఊబర్ ధరలు 2018 నుంచి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయి. నాలుగేళ్ళల్లో ఏకంగా 83 శాతం ధరలు పెరిగాయి. ఇండియాలో కూడా ఈ క్యాబ్ ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu