Ad Code

మార్స్‌పై జీవుల్ని నాసా చంపిందా ?


అంగారక గ్రహంకి సంబంధించి ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. అది ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. అది ఏంటంటే.. నాసా, 50 ఏళ్ల కిందటే మార్స్ గ్రహంపై జీవుల్ని కనిపెట్టింది. కానీ అనుకోకుండా వాటిని చంపేసింది అని బెర్లిన్ లోని టెక్నికల్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న ప్రముఖ సైంటిస్టు ప్రొఫెసర్ డిర్క్ షుల్జ్-మకుచ్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. "భూమిపై నీరు ఉంది కాబట్టి ఇక్కడ జీవం ఏర్పడింది. మార్స్ గ్రహం.. ఎండిపోయిన గ్రహం. అక్కడ ఒకప్పుడు నీరు ఉండేది. కాబట్టి అక్కడ నీటిని యాడ్ చేయడం ద్వారా జీవుల ఆనవాళ్లు కనిపెట్టవచ్చు" అని ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ డిర్క్ షుల్జ్-మకుచ్ అన్నారు. ఆయన లెక్క ప్రకారం 50 ఏళ్ల కిందటే నాసా అంగారక గ్రహంపై జీవుల్ని కనిపెట్టింది. అయితే అనుకోకుండా వాటిని నాశనం చేసింది.  నాసా, క్యూరియోసిటీ రోవర్‌ని మార్స్‌పై దింపక ముందు 1970 మధ్యలో  వైకింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. మార్స్ ఉపరితలంపైకి 2 ల్యాండర్లను పంపింది. అంటే.. మన ఇస్రో, చందమామపైకి విక్రమ్ ల్యాండర్ పంపింది కదా.. అలా పంపింది. ఈ మిషన్ ఉద్దేశం ఏంటంటే.. మార్స్ ఉపరితలం ఎలా ఉందో ఫొటోలు తీసి పంపాలి. అంతేకాదు. మార్స్ మట్టిపై జీవరసాయన పరిశోధనలు చేసి.. జీవులు ఉన్నదీ లేనిదీ కనిపెట్టాలి. "వైకింగ్ మిషన్.. నీటి ద్వారా మార్స్ గ్రహంపై అనేక భౌగోళిక నిర్మాణాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఈ నిర్మాణాలు మన భూమిపై మార్టిన్ అగ్నిపర్వతాలు, హవాయిలో ఉన్న నిర్మాణాలకు దగ్గరి పోలికలు కలిగివున్నాయి. భూమిపై నిర్మాణాలు.. వర్షం వల్ల ఏర్డడ్డాయి. అంటే మార్స్‌పై కూడా వర్షం లాంటిది పడిందా.. అనేది ఒక ప్రశ్న అయితే.. వైకింగ్ ల్యాండర్స్.. క్లోరినేటెడ్ ఆర్గానిక్స్‌ను మార్స్ మట్టిలో కనిపెట్టాయి. కానీ.. అవి భూమికి సంబంధించిన ఆర్గానిక్స్ కావచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ఐతే.. ఆ తర్వాత నాసా పంపిన మిషన్లు.. మార్స్‌పై క్లోరినెటెడ్ రూపంలో కర్బన సమ్మేళనాల ఉనికిని నిర్ధారించాయి" అని ఆ శాస్త్రవేత్త బిగ్ థింక్‌లోని ఒక కాలమ్‌లో రాశారు.

Post a Comment

0 Comments

Close Menu