Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, August 4, 2023

ఎంజీ కామెట్ ఈవీ 'స్పెషల్ గేమర్' !


ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల కామెట్ EV ప్రత్యేకమైన గేమర్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. భారత టాప్ గేమర్‌లలో ఒకరైన మోర్టల్ అని పిలిచే నమన్ మాథుర్‌తో ప్రత్యేకమైన సహకారాన్ని అందిస్తోంది. MG కామెట్ EV మొత్తం 3 సాధారణ వేరియంట్‌లలో వస్తుంది. ప్రతిదాని ధర కన్నా MG కామెట్ గేమర్ ఎడిషన్ ధర రూ. 65,000 ప్రీమియంతో వస్తుంది. ఈవీ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా కస్టమైజ్ చేసిన కారు ఇదే. ఎంజీ కామెట్ గేమర్ ఎడిషన్ చక్రాలు, డోర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. B-పిల్లర్‌పై స్టిక్కర్‌లతో పాటు ప్రత్యేకమైన డిజైన్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. కారు లోపల క్యాబిన్ నియాన్ లైట్లతో అప్‌గ్రేడ్ అయింది. పవర్‌ఫుల్ గేమింగ్ వాతావరణాన్ని కలిగి ఉంది. అదనంగా, కీ, వివిధ ఇంటీరియర్ ఎలిమెంట్స్ స్పెషల్ డిజైన్‌తో ప్రీమియం టచ్‌ను కలిగి ఉన్నాయి. ఎంజీ మోర్టల్ మధ్య సహకారంతో గేమింగ్, ఆటోమోటివ్ ప్రపంచాన్ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకమైన జీవనశైలితో కూడిన కారును కోరుకునే గేమర్‌ల కమ్యూనిటీని అందిస్తుంది. ఇందులోని ప్రత్యేక డిజైన్, గేమింగ్-ప్రేరేపిత ఫీచర్లు, ఎంజీ కామెట్ గేమర్ ఎడిషన్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఎంజీ కామెట్ EV ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). పేస్, ప్లే, ప్లష్ అనే 3 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంజీ కామెట్ పేస్ ఎంట్రీ-లెవల్ ట్రిమ్ ధర రూ. 7.98 లక్షలు, ప్లే, ప్లస్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment

Popular Posts