Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, August 18, 2023

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్ కార్ట్  వివో X సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ తో రూ. 79,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 21 వేల రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్ తో రూ. 57,890 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ లను కూడా జత చేసింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ. 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. vivo X80 pro స్మార్ట్ ఫోన్ రూ. 54,890 అఫర్ ధరకే పొందే వీలుంది. ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్, కెమెరా, డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి అన్ని విభాగాల్లో కూడా ప్రీమియం సెటప్ ను కలిగి వుంది మరియు ఈ ఫోన్ ధరకు తగిన న్యాయం చేస్తుంది. ఈ ఫోన్ 6.78-inch బిగ్ AMOLED డిస్ప్లేని LTPO 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200×1440 (WQHD+) రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే మీకు అత్యద్భుతమైన విజువల్స్ ను మీకు అందిస్తుంది. Snapdragon 8 Gen 1 ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్ అందిస్తుంది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది.  32MP సెల్ఫీ కెమేరా మరియు (50MP) + (48MP) + (12MP) + (8MP) రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో అనేకమైన కెమేరా ఫిల్టర్ లను మరియు అప్షన్ లను కూడా వివో జత చేసింది. ఈ ఫోన్ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను మరియు వీడియోలను చిత్రీకరించవచ్చు.

No comments:

Post a Comment

Popular Posts