Ad Code

ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు సెర్ట్-ఇన్ హెచ్చరిక !


ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) హెచ్చరించింది. ఆండ్రాయిడ్ వర్షన్లలో లోపాలు తీవ్రమైనవని, ఈ లోపాల ఆసరాగా సైబర్ మోసగాళ్లు  ఆయా ఫోన్లను హ్యాక్ చేసి వాటి యూజర్ల సున్నితమైన వ్యక్తిగత డేటా తస్కరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్-10, 11,12, 12ఎల్, 13 వర్షన్లలో ఈ లోపాలు ఉన్నాయని తాము గుర్తించామని సెర్ట్-ఇన్ తెలిపింది. ఫ్రేమ్ వర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టమ్ కాంపొనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్ డేట్స్, క్వాల్కం క్లోజ్డ్ సోర్స్ కాంపొనెంట్స్‌లో తప్పిదాలతో ఈ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ తప్పిదాల ఆసరగా సైబర్ మోసగాళ్లు ఆయా ఫోన్లలో యూజర్ల పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా తస్కరించవచ్చునని సెర్ట్ ఇన్ హెచ్చరించింది. ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా కాపాడుకునేందుకు అనునిత్యం యూజర్లు తమ ఫోన్ల సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ హితవు చెప్పింది. డివైజ్ సెట్టింగ్స్‌లో సిస్టమ్ ఆప్షన్  తర్వాత సిస్టమ్ అప్ డేట్ క్లిక్ చేయాలి. ఏదైనా అప్ డేట్ ఉంటే సెలెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. ఫోన్‌లో మాల్వేర్ ఉందా.. అనే విషయమై తేల్చుకోవడానికి సెక్యూరిటీ యాప్ వినియోగిస్తుండాలని సెర్ట్-ఇన్ తెలిపింది. ప్రత్యేకించి ఫోన్లకు బలమైన పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు యాప్స్‌లో టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ ఉపయోగించాలని సూచించింది. 

Post a Comment

0 Comments

Close Menu