Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, August 16, 2023

ఎల్‌జీ నుంచి 'సూట్‌కేస్ టీవీ' !


ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా స్టాండ్‌బైమీ గో  పేరుతో కొత్త పోర్టబుల్ టచ్‌స్క్రీన్ టీవీని లాంచ్ చేసింది. ఇది ఒక ట్రావెలింగ్ సూట్‌కేస్‌తో వస్తుంది. ఈ సూట్‌కేస్‌ ఓపెన్ చేస్తే టీవీ స్క్రీన్, స్పీకర్స్, పవర్ సప్లై వంటివి కనిపిస్తాయి. ఈ బ్రీఫ్‌కేస్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దాన్ని ఓపెన్ చేసి 27-అంగుళాల సైజు ఉండే టీవీ స్క్రీన్‌పై వీడియో కంటెంట్ చూసి ఆస్వాదించొచ్చు. స్వివెల్ డిజైన్‌తో వచ్చే స్టాండ్‌బైమీ గో టీవీ స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. దీంట్లోని 20W స్పీకర్స్‌తో అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదిస్తూ సినిమాలు చూడవచ్చు. చెస్ వంటి ఆటలు ఆడుకోవచ్చు. లేదా ప్రయాణంలో వర్క్ చేయడానికి ఉపయోగించవచ్చు. స్టాండ్‌బైమీ గో  టీవీలోని ఇన్‌-బిల్ట్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో గరిష్ఠంగా మూడు గంటల స్క్రీన్ టైమ్ అందిస్తుంది. ఈ ఫెసిలిటీతో పవర్ ఔట్‌లెట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పార్క్, బీచ్, బ్యాక్‌యార్డ్ పార్టీలు లేదా క్యాంపింగ్ ట్రిప్‌కు టీవీని తీసుకెళ్లవచ్చు. స్టాండ్‌బైమీ గో టీవీ చిన్నగా ఉన్నా డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తుంది. ఈ TV LG సొంత webOSతో రన్ అవుతుంది. ఈ OSలో నెట్‌ఫ్లిక్స్ , హులు(Hulu), అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా పలు రకాల స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. కొత్త టీవీ యాపిల్ ఎయిర్‌ప్లే, బ్లూటూత్ పెయిరింగ్, Wi-Fiకి మద్దతు ఇస్తుంది. ఇది 1080p రిజల్యూషన్ LCD డిస్‌ప్లేతో వస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts