Ad Code

జొమాటో ప్లాట్‌ఫాం ఫీజు !


జొమాటో ఫుడ్ ఆర్డర్లపై మరో కొత్త ఫీజు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.  ప్రతీ ఆర్డర్‌పై రూ. 2 చొప్పున ప్లాట్‌ఫాం ఫీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఆర్డర్ కు సంబంధించి బిల్లు ఎంత ఉంటుందనే అంశానికి సంబంధం లేకుండా అన్ని ఆర్డర్లపై ఈ ఫీజు ఉండనుంది. అయితే.. ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే.. రానున్న రోజుల్లోనూ లాభాల్లోనే ఉండాలన్న ఆలోచనతోనే కంపెనీ ఇలా చేసినట్లు సమచారం. అయితే.. ఈ ఆర్డర్లపై అదనపు ఛార్జీలు ప్రస్తుతానికి కస్టమర్లందరికీ వర్తింపజేయడం లేదు. దీనిని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఇంకా బ్లింకెట్, జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంకు కూడా ఈ ప్లాట్‌ఫాం ఫీజును వర్తింప చేయడం లేదు జొమాటో. సంస్థను సరిగా నడిచేందుకు ఇలా ఛార్జీలు తమకు అవసరమని జొమాటో భావిస్తోంది. దీనిని ఒక ప్రయోగంగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు జొమాటో ప్రతినిధి. ఈ ఫుడ్ అగ్రిగేటర్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో.. 3 నెలల్లో ఏకంగా 17.6 కోట్ల భారీ ఆర్డర్లను అందుకుంది. అంటే.. దాదాపు రోజుకు 20 లక్షల ఆర్డర్లను పొందినట్లు చెప్పొచ్చు. ఇలా నెలకు 6 కోట్ల ఆర్డర్లను పరిగణలోకి తీసుకుంటే.. ప్లాట్‌ఫాం ఫీజుతోనే నెలకు ఏకంగా రూ.12 కోట్ల లాభాలు జొమాటోకు లభిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu