Ad Code

పెన్ స్పై కెమెరా !


మెక్‌స్మార్ట్ బ్రాండ్ నుంచి వచ్చిన V8 ఫుల్ HD పెన్ కెమెరా వచ్చింది.  దీనికి 1080P వీడియో క్వాలిటీతోపాటూ.. ఆడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కెమెరాతో 32 gb SD కార్డు కూడా ఇస్తున్నారు. దీన్ని ఇంట్లో, ఆపీసులో ఎక్కడైనా సెక్యూరిటీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే పెన్ కామ్ కార్డర్ అని తెలిపారు. ఈ పెన్నును USB కేబుల్‌తో ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కేబుల్ కూడా ఇస్తున్నారు. SD కార్డును బయటకు తీసి, ల్యాప్‌టాప్‌కి ఇన్సెర్ట్ చూసి కూడా కంటెంట్ చూడొచ్చు. దీని పొడవు 5, వెడల్పు 2, ఎత్తు 2 సెంటీమీటర్లు ఉంటుంది.  ఈ పెన్ కెమెరా లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుందని తెలిపారు. ఇందులో జూమ్ లెన్స్ వాడినట్లు వివరించారు. ఇది ఫుల్ HD కెమెరా కాబట్టి.. విజువల్స్ అత్యంత స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా వస్తాయి. దీన్ని జేబుకి పెన్నులా పెట్టుకోవచ్చు. నోట్ బుక్‌కి క్లిప్‌లా పెట్టుకోవచ్చు. ప్రొడక్టుతో 1 కెమెరా పెన్, 1 32GB SD కార్డు, 1 USB కేబుల్, 1 యూజర్ మాన్యువల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా అడ్వాన్స్డ్ వీడియో పెన్ అని తెలిపారు. స్మార్ట్‌గా పనిచేస్తుందన్నారు. ముఖ్యమైన అంశాల్లో ఈ పెన్‌ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అందమైన లేదా క్రిటికల్ మూమెంట్స్‌ని రికార్డ్ చేసుకోవచ్చని వివరించారు. ఇది 1920 x 1080 వీడియో రిజల్యూషన్‌తో ఉంది కాబట్టి.. దీన్ని కొనుక్కోవడం సరైన్ ఆప్షన్ అని తెలిపారు. ఈ పెన్ కెమెరా కంటిన్యూగా 150 నిమిషాలు రికార్డ్ చేస్తుందనీ.. లూప్ రికార్డింగ్ ఆప్షన్ ఉందని తెలిపారు. ఎక్కువ సేపు కంటెంట్ రికార్డ్ చెయ్యాలి అనుకునేవారికి ఈ పెన్ బాగా ఉపయోగపడుతుందని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu