Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, August 28, 2023

గాలి కొట్టేసుకొనే మినీ టైర్‌ ఇన్‌ఫ్లేటర్‌ !


టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్‌ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్‌ బంకులకో, మెకానిక్‌ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్‌ కంపెనీ 'థామస్‌ పంప్స్‌' ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే 'మినీ పంప్‌'ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్‌ అవుతుంది. దీని సాయంతో సైకిల్‌ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్‌ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. 

No comments:

Post a Comment

Popular Posts