Ad Code

యూట్యూబ్ కొత్త ఫీచర్ లాంచ్ ?


యూట్యూబ్ కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ యూజర్ల సెర్చ్ తీరును మరియు శ్రమను మరింత తగ్గిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ను అనౌన్స్ చెయ్యడమే కాకుండా కొంత మంది ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రోల్ అవుట్ కూడా చేసింది. ఈ కొత్త ఫీచర్ తో మీకు నచ్చిన లేదా కావలసిన పాటను సెర్చ్ చెయ్యడానికి కేవలం హమ్మింగ్ చేస్తే సరిపోతుంది. గూగుల్ ఈ ఫీచర్ ను ముందుగా యూట్యూబ్ లో తీసుకువస్తోంది మరియు ఈ ఫీచర్ సక్సెస్ తరువాత దీన్ని గూగుల్ సెర్చ్ కు యాడ్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫీచర్ తో పాట ను సెర్చ్ చేయడానికి 3 కంటే ఎక్కువ సెకన్లు హమ్మింగ్ చేయవలసి ఉంటుంది. ఇదే గూగుల్ లో అయితే దాదాపుగా 15 సెకన్ల వరకూ హమ్మింగ్ చేయవలసి ఉండవచ్చు. ఈ ఫీచర్ ను ద్వారా యూజర్లు వారికి నచ్చిన పాటను వెతకటానికి ఇది చాలా సింపుల్ సెర్చ్ అవుతుంది. ఎందుకంటే, పాట ని ఎలా సెర్చ్ చెయ్యాలో తెలియక పోయిన కేవలం ఆ హమ్మింగ్ చేస్తే చాలు పాట ప్రత్యక్ష్యం అవుతుంది. పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా సెర్చ్ తీరు మరింత సులభంగా మరియు సరళంగా మారుతోంది. యూట్యూబ్ లో వచ్చిన ఈ కొత్త హమ్మింగ్ సెర్చ్ ఫీచర్ యూట్యూబ్ లో సాంగ్స్ ని సింపుల్ గా సెర్చ్ చేసేల చేస్తుంది. మీకు కూడా పాట గుర్తు లేకపోతే ఈ కొత్త ఫీచర్ ఒకటి ఉందని గుర్తుంచుకోండిడ్ మరియు జెస్ట్ హమ్మింగ్ చేసే పాటను పట్టుకోండి. ఈ కొత్త ఫీచర్ ను ప్రస్తుతం కొంత మంది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే యూట్యూబ్ అందించి మరియు టెస్టింగ్ విజయవంతమైన తరువాత ఈ ఫీచర్ ను అందరూ యూట్యూబ్ యూజర్లు అందుకోవచ్చు. అంటే, మీ ఫోన్ లో ఈ ఫీచర్ కనిపించకే పొతే ఈ ఫీచర్ ను మీరు అందుకోవడానికి మరికొంత సమయం పడుతుందని గుర్తుంచుకోండి. యూట్యూబ్ ఈ ఫీచర్ ద్వారా తన యూజర్ల అనుభూతిని మరియు సెర్చ్ చేసే తీరును మరింత సింపుల్ చేస్తుంది. ఈ హమ్మింగ్ ఫీచర్ మీ ఫోన్ అందుకుంటే మీరు ఈ ఫీచర్ ను ఖచితంగా ట్రై చేయండి మరియు కొత్త టెక్ ను అందించండి. మీరు ఈ ఫీచర్ ను ఖచ్చితంగా ఆనందిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu