Ad Code

టెలిగ్రామ్ లో ఎడిట్ ఫీచర్‌ !


టెలిగ్రామ్ అడ్వాన్స్డ్ ఫీచర్లు పరిచయం చేస్తూ వాట్సాప్ కు పోటీగా నిలుస్తోంది. పోటీ యాప్స్‌లో లేని ఎన్నో స్పెసిఫికేషన్లను ఇప్పటికే పరిచయం చేసిన ఈ పోర్టల్, తాజాగా యూజర్లు పోస్ట్ చేసిన స్టోరీస్ ఎడిట్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ వంటి మరే ఇతర ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. హిస్టరీలోనే తొలిసారిగా స్టోరీస్ ఎడిట్ చేసుకోగల సదుపాయాన్ని టెలిగ్రామ్ అందించింది. 2023, ఆగస్టు 14 నాటికి యాప్ లాంచ్ చేసి పదేళ్లు అయిన సందర్భంగా కంపెనీ ఈ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఎడిట్ ఫీచర్‌తో టెలిగ్రామ్ యూజర్లు ఆల్రెడీ పోస్ట్ చేసిన స్టోరీస్‌లోని క్యాప్షన్, టెక్స్ట్, స్టిక్కర్లు, విజిబిలిటీ సెట్టింగ్‌లతో సహా ఏదైనా మార్చవచ్చు. దీనర్థం పోస్ట్ చేసిన తర్వాత వారు చేసే ఏవైనా పొరపాట్లను సరిదిద్దవచ్చు లేదా కొత్త సమాచారంతో వారి స్టోరీస్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఒక పార్టీ గురించి స్టోరీస్‌ పోస్ట్ చేసిన కొంతసేపటికి వారు పార్టీ తేదీని మార్చాలని నిర్ణయించుకుంటే, కొత్త సమాచారంతో స్టోరీస్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ మొన్నటిదాకా అందుబాటులో లేకపోవడంతో స్టోరీస్ పోస్ట్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పోస్ట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఎడిట్ ఫీచర్ ఇప్పుడు టెలిగ్రామ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. దీన్ని యాక్సెస్ చేయడానికి, స్టోరీస్ సెక్షన్ ఓపెన్ చేసి, ఏదైనా ఒక స్టోరీ టాప్ రైట్‌ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. "ఎడిట్ స్టోరీ" సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టోరీలో చేయాల్సిన మార్పులు చేయాలి. ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత "సేవ్"పై నొక్కాలి. టెలిగ్రామ్ స్టోరీస్‌లో మరిన్ని స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ అందిస్తున్న "డ్యూయల్ కెమెరా మోడ్‌"తో స్టోరీస్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలను ఒకేసారి ఉపయోగించవచ్చు, స్టోరీస్‌ ఎవరు చూడాలో పూర్తిగా నియంత్రించవచ్చు. అది ఎంతసేపు కనిపించాలో ఎంచుకోవచ్చు. స్టోరీస్‌ స్క్రీన్ పైభాగంలో కనిపిస్తాయి, కాబట్టి చాట్స్‌ను ఈజీగా చూసుకోవచ్చు. నిర్దిష్ట వ్యక్తుల నుంచి స్టోరీస్‌ హైడ్ కూడా చేయవచ్చు. స్టోరీస్‌కు టెక్స్ట్, డ్రాయింగ్స్‌, స్టిక్కర్లు, లొకేషన్ జోడించడం ద్వారా అందంగా కనిపించేలా చేయవచ్చు. స్టోరీస్‌లో మరిన్ని వర్డ్స్ రాయవచ్చు, స్నేహితులను ట్యాగ్ చేయవచ్చు లేదా లింక్‌లను జోడించవచ్చు. స్టోరీస్‌ పోస్ట్ చేసినప్పుడు, ఎవ్రీవన్, కాంటాక్ట్స్, ఓన్లీ యువర్ కాంటాక్ట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లేదా స్పెసిఫిక్ కాంటాక్ట్స్‌లో ఎవరు చూడవచ్చో ఎంచుకోవచ్చు. స్టోరీస్‌ 6, 12, 24, లేదా 48 గంటల పాటు లైవ్‌లో ఉండేలా ఎంచుకోవచ్చు. ప్రొఫైల్‌లో కూడా స్టోరీస్‌ చూపవచ్చు. మరింత ప్రైవేట్‌గా ఉండాలనుకుంటే, ప్రీమియం వినియోగదారులు స్టెల్త్ మోడ్‌ (Stealth Mode)ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఐదు నిమిషాలలోపు ఓపెన్ చేసిన స్టోరీస్ నుంచి తాము వ్యూ చేసినట్లు తొలగించవచ్చు. అలానే రాబోయే 25 నిమిషాల్లో చూసే ప్రతి వ్యూ హైడ్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu