Ad Code

రక్షణ శాఖలో మాయా ఓఎస్ !


దేశవ్యాప్తంగా రక్షణ,కీలకమైన మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న సైబర్, మాల్వేర్ దాడుల నేపథ్యంలో, రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన అన్ని కంప్యూటర్‌లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కొత్త ఓఎస్, మాయాతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మాయా ఓఎస్ ని ఓపెన్ సోర్స్ ఆధారంగా ఉబుంటు స్థానికంగానే అభివృద్ధి చేసింది. మాయకు ఇంటర్‌ఫేస్ ఉంది. విండోస్ వంటి అన్ని ఫంక్షనాలిటీలు ఉన్నాయి. వాస్తవానికి వినియోగదారులు విండోస్ నుంచి మాయాకు మారినప్పటికీ పెద్దగా తేడా అనిపించదు. సౌత్ బ్లాక్‌లోని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన అన్ని కంప్యూటర్‌లలో ఆగస్టు 15 లోపు మాయాను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు చెబతున్నారు. అదనంగా, ఈ వ్యవస్థలలో ‘ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్’, చక్రవ్యూహ్ ను కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ప్రస్తుతం, మాయ రక్షణ మంత్రిత్వ శాఖ సిస్టమ్‌లలో మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అయితే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నెట్ వర్క్ లకు కనెక్ట్ అయ్యే కంప్యూటర్‌లకు అనుసంధానం చేయడం లేదు. దీనిని ఈ మూడు సర్వీస్ లలోని నిపుణులు పరిశీలించారు. త్వరలోనే దాని సెక్యూరిటీ తనిఖీ చేసి ఇన్ స్టాల్ చేస్తారు. నేవీ సంస్థ దీనిని ఇప్పటికే పరిశీలించి, ధ్రువీకరించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ త్వరలో పరిశీలించనున్నట్లు అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. మాయా ఓఎస్ ను కేవలం ఆరు నెలల్లోనే మన దేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలు రూపొందించాయని చెబుతున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ మాల్వేర్ దాడులు, ఇతర సైబర్‌ అటాక్‌లను నివారిస్తుందని చెబుతున్నారు. ఫుల్ లెగ్త్ సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఓఎస్ ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. దేశంలో ఈ మధ్యకాలంలో కీలకమైన మౌలిక సదుపాయాల వింగ్ లోని కంప్యూటర్లు సహా అన్ని రంగాల్లోనూ ఈ మాల్వేర్, ర్యాన్ సమ్ దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో విండోస్ ఓఎస్ ను మార్చేందుకు ప్రణాళిక చేశారు. దాని స్థానంలో ఇటువంటి మాల్వేర్ లను నిరోధించే కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ కొత్త మేడిన్ ఇండియన్ ఓఎస్ తో సంపూర్ణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu